సేవే జీవిత పరమావధి

సేవే జీవిత పరమావధి

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

  • సేవా రంగాన మేరు శిఖరము.
  • కుల మత రహిత సేవ పరాయణుడు, నారాయణుడు.
  • సమాజ హితమే తన ధ్యేయం.
  • సంఘ హితకారుడు.
  • సేవా ముని.
  • సేవా సంపన్నులు.
  • ఉపకార యోగి.
  • జీవిత సత్య శోధనలతో జీవితాన్ని గడిపి, కుటుంబ వ్యక్తులకు భావి తరాలకు ఆదేశం ఇచ్చిన ఆదర్శ వ్యక్తి.
  • ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత.
  • జాతిని జగత్తుకు మానవతా మూర్తి.
  • సాహితీ సేవ, సమాజ సేవ, ఆయన నేత్ర ద్వయాలు.
  • కళా ప్రపూర్ణ (1988).
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ శ్రీగణపతి రామాయణం (1990).
  • రాజ లక్ష్మీ ఫౌండేషన్ అవార్డ్ (1995).
  • ఇవి గాక ఎన్నో విభిన్న సంస్థల నిర్వహణ ఎన్నో అవార్డులు ఆయన సొంతమే. అవార్డ్ కే ఆయన కీర్తి నిచ్చిన వ్యక్తి. గాంధీజీ, వినోబాజి అనుంగు అనుచరులు. ప్రతి పని ఆయన ఆచరించి ఎదుటి వారికి చెపుతారు. సమాజ హితకారుడు. ఒక సారి చర్ల గణపతి శాస్త్రి గారు ఒక పెళ్లికి వెళ్లి, రాత్రి తమ్ముడు జనార్ధన శాస్త్రి గారి ఇంట్లో విజయవాడ గాంధీ కొండ పై, ఆయన హిందీ విద్యాలయం. ఆయన భార్య బాపయ్యమ్మ తో కలిసి విద్యా సేవ చేసేవారు. అక్కడ ఒక గదిలో విశ్రమించి ఉండగా తలుపు చప్పుడు అయ్యింది. గడియ తీసి తలుపు తీస్తే ఒక యువకుడు లోపలికి వచ్చి, మా నాన్నకు బట్టలు కావాలి ఇవ్వండి అని అడిగాడు. పెళ్ళిలో పెట్టిన కొత్త పంచెల చాపు ఇచ్చారు. ఇది చాలదు కట్టుకున్నది కూడా ఇమ్మన్నాడు. అప్పుడే వేరే లేవు అన్నా సర్ ఇవ్వమని జాలిగా అడిగాడు. దానికి శాస్త్రి గారి హృదయం ద్రవించి పడుక్కున్న బొంత కట్టుకుని ఆ పంచే కూడా ఇచ్చారు. ఆ కుర్రాడు నాకు మీ గోల్డ్ చైన్ వాచీ కూడా కావాలి అన్నాడు. ఇది మా అబ్బాయి ప్రేమతో ఇచ్చాడు, కాలం నాకు అది చెపుతుంది కనుక కుదరదు అన్నారు. అలా కాదు నేను మీ కొడుకునే కదా ఇవ్వండి అని పట్టుబట్టాడు. ఈ అలికిడికి ప్రక్క గదిలో ఉన్న తమ్ముడు జనార్దన శాస్త్రి నిద్ర లేచి వచ్చి దొంగ దొంగ అని అరిచాడు. అక్కడ ఉన్నవాళ్లు లేచి పరుగెడుతున్న కుర్రాడిని పట్టుకుని కొట్ట బోయారు. శాస్త్రి గారు వారించి వివరాలు అడిగారు. ఆ అబ్బాయి ఇంటర్ చదువుకున్న జాబ్ రాలేదు. అందుకు ఈ మార్గంలోకి వచ్చాను అన్నాడు. ఆకలి భాధ ఏ పనికైన వెనుదియ్యదు. సమాజం లో ఎందరికో జీవిత గమ్యం సూచించిన ఘనులు, వారి దగ్గరకు వెళ్ళిన యువకులను సన్మార్గం వైపు వారి వివరాలు తెల్సుకుని మళ్లించి వారికి ఉద్యోగం వేయించి, జీవితం నిలబెట్టి మంచి మార్గంలో పెట్టారు. అందుకే సమాజ హిత కారుడు.
  • బాల్య స్ఫూర్తి:
    ఒకసారి శాస్త్రిగారు ఒక పౌరాణిక నాటకం (సత్య హరిచంద్ర ) చూసి వచ్చి అర్ధరాత్రి దాటడం వల్ల తలుపు కొట్టడం ఇష్టం లేక అరుగు పై పడుకున్నారు. అప్పుడు ఎనిమిది ఏళ్ల వయసు చెవులకు బంగారు పోగులు ఉండేవి. ఎక్కడ దొంగలు వస్తారో అన్న భయంతో, చెవులు మూసుకుని పడుకోవడం వల్ల నిద్ర భంగం అయ్యింది. ఉదయమే జ్ఞానోదయం అయ్యి అవి కంసాలి చేత విప్పించికున్నారు. బాల్యలోనే ఇది ఒక స్ఫూర్తి.
  • ఆపద్బాంధవుడు:
    పల్లెలో అగ్ని ప్రమాదం జరిగిన వారికి ఆశ్రయం ఇచ్చి, భోజనం పెట్టి అవసరాలు తీర్చిన ఆపద్బాంధవుడు. అంతే కాదు తన పిల్లల చేత కూడా వారికి సేవ చేయించి పాత బట్టలు పంచి ఇచ్చిన ఘనులు.
    నిరుద్యోగం వల్లే ఆకలి భాధలు. అన్యాయాలు చెడు ప్రవర్తన అవి తెలిసుకొని, వాళ్ళ గురించి వివరాలు పుచ్చుకుని ఉద్యోగం వేయించి మంచి మార్గంలోకి మళ్ళించి, అన్నార్తులను, ఆర్తులను వారి జీవితాన్ని మార్చి మంచి మార్గంలో పెట్టారు. అందుకే సమాజ హిత కారుడు.
    మాల గూడెంలో విద్య గంధము:
    రాత్రి బడిలో లాంతరు వెలుగులో విద్య నేర్పి, పరిశుభ్రత, ఆరోగ్యము, హోమియో మందులు మంచి ఆహారము ద్వారా వచ్చే ఆరోగ్య అంశాలు తెలిపేవారు. పిల్లలని సహితము మాల గూడెంలో విద్యలు నేర్పడానికి పంపేవారు. అందుకే మాల బ్రాహ్మలుగా ప్రసిద్ది పొందారు.
  • ఆధునిక పతివ్రతా  శిరోమణి:
    శ్రీమతిని కస్తూర్బా మహిళా మండలి శాస్త్రి గారు ఏర్పాటు చేసి, ఆమెను అధ్యక్షురాలిగా పెట్టీ, పలువురు మహిళలను సభ్యులుగా పెట్టీ, మహిళలకు విద్య ఉద్యోగ ఉపాధి మార్గం చూపారు. శ్రీమతి సుశీల గారు కూడా భర్త ఆశయాలను అనుసరిస్తూ ఉండేవారు. రైతు కొడుకు గదిలో పెట్టిన ఇత్తడి గిన్నెలో బియ్యం పోసి పెట్టింది తీసుకు వెళ్లి, కోమటి కొట్లో అమ్ముతుంటే ఆ ఇంటి పనిమనిషి అదే సమయానికి కొట్టుకు సరుకుల కోసం వెళ్ళింది. అప్పటికే కోమటి వాడు ఇంత పెద్ద ఇత్తడి గిన్నె ఈ కుర్రాడికి ఎలా వచ్చింది అనుకుంటున్నాడు. అంతే విషయం బయట పడింది. అంతా కలిపి వాడిని బాదుతుంటే విషయం సుశీల అమ్మకి తెలిసీ పరుగున కొట్టుకు వెళ్లి, వాడు నా మనుమడు వాడిని ఏమీ అనవద్దు వాడి సంగతి నేను చూసుకుంటాను అని వాళ్ళందరినీ ఎదురించి ఆ పిల్లాడిని తీసుకు వచ్చి, హితవు చెప్పి చదువులో పెట్టీ ఆ తరువాత ఉద్యోగం వేయించి జీవితాన్ని సరి చేశారు. బీదలకు రిక్షా, మాల గూడెంలో వారికి అన్నం పెట్టేవారు. పడవ నడిపే వారికి పెరుగు అన్నం పెట్టి అలసట తీర్చి పడుకుని వెళ్ళ మనేవరు. బీద కుటుంబాల వారు కొందరికి తెల్ల వార గట్ల బియ్యం, పప్పు, కూరలు సంచిలో పోసి, గుమ్మం ముందు పెట్టేవారు. మోహమాట పడుతారని అడగ కుండానే ఇచ్చేవారు.
    పాత బట్టలు పంచేవారు. ఆమెకు ఇచ్చిన మామిడి జామ అరటి బత్తాయి పళ్లు దారిలో కనిపించిన వారికి ఇచ్చి ఆకలి దప్పిక తీర్చేవారు. కొందరు పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే నాన్న వచ్చాక అన్నం పెడతాను అని, తల్లి సముదా ఇస్తుంటే విని అన్నం పట్టుకెళ్ళి ఇచ్చేవారు. ఇలా సుశీల గారు కూడా శాస్త్రి గారి ఆశయాలు అనుకరిస్తూ అన్నదాతగా, సమాజ అన్నపూర్ణగా, మానవతా వాది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!