ఆనంద బాల్యము (గేయం)

ఆనంద బాల్యము (గేయం)

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: టీ. వి. ఎల్. గాయత్రి

అవనికి నదులూ తరువులు అందము

అల్లరి పిల్లలు ఇంటికి అందము

అమ్మా నాన్నలతో అనుబంధము

అందరు మెచ్చే సంసార బంధము.

ఆంధ్రుల భాష తెలుగు తీయగ

ఆ తల్లి పాటలు పాడగ

ఆహ్లాదమైనది పిల్లల బాల్యము

ఆటలతో ఆనందముగా గడిపెడి బాల్యము.

ఇలలో మంచిగా నిలిచిన

ఇరవుగ చదువులో వెలిగిన

ఇక్కట్లను మదిలో తల్చక

ఇమ్ముగ గడుపుచు బ్రతుకగ

ఈర్ష్యను రానీయక పెరిగిన

ఈ భువిలో తిరుగుచు

ఈ దేశపు పౌరులై మెలిగిన

బాలలు వర్థిల్లు నిండుగా

సిరులే కురియును మెండుగా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!