లాభమా? నష్టమా?

లాభమా? నష్టమా?

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన:సుజాత కోకిల

 పూర్వకాలంలో రజస్వల కాకముందే వివాహాలు చేసెే సాంప్రదాయం ఉంది. వీటినే బాల్యవివాహాలు అంటారు ‘అష్టవర్షాత్ భవేత్కన్య’ అని ఎందుకంటారంటే ఎనిమిది సంవత్సరాలు దాటక ముందే చేస్తారు. ఇంక విశేషం ఏంటంటే కన్యాదాన ఫలితం కూడా ఉంటుంది. రెండవది అదృష్ట దేవతల ప్రభావం యుక్తవయసు బాలలపై పడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఎందుకంటే దీనిని రెండో వివాహం కింద భావిస్తారు. పరపురుషుని ప్రభావం ఉండకూడదనెెేది కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యుక్తవయస్సు వచ్చాక చెేస్తున్నారు. రజస్వల అయిన వివాహాన్ని వృషాలి వివాహం అంటారు. జ్ఞానం తెలియని పిల్లలకు చేస్తారు, కాబట్టి భయభక్తులు ఉండాలనే ఉద్దేశంతో అత్తగారు అలా భయభక్తుల్లో ఉంచేవారు. అదే రానురాను క్రమశిక్షణ పేరుతో హింసించడం లాంటివి చేసేవారు. కట్టుబాట్ల పేరుతో ఇంటికే పరిమితం చేసేవారు. చిన్నవయసులోనే పిల్లలను కనడం, వాళ్ళని పెంచడంతో పాటు ఎన్నో బాధలను భరిస్తూ సంసారాన్ని ఈదుకుంటూ వచ్చేవారు. అసలైన సాంప్రదాయాలను విడిచిపెట్టి తల్లిమాట కొడుకు వినడంతో కొన్ని ఇళ్ళలో ఎక్కువగా గొడవలు జరుగుతుండేవి. చిన్నతనంలో వివాహం అయినా కొందరు సమయస్ఫూర్తితో సంసారాన్ని బాగు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత హింసించిన భర్త అంటే గౌరవం ప్రేమ ఉండేది. అప్పట్లో చాలా మంది పిల్లలను కనెేవారు ఉన్నదాంట్లో తృప్తిగా తింటూ సంతోషంగా ఉండే కుటుంబాలు చాలా బాగున్నాయి. కొన్ని అన్నవస్త్రాలు లేక బాధపడిన కుటుంబాలున్నాయి. పిల్లల మధ్య వయసు తేడా చాలా ఉండేది. పూర్వకాలంలో చాలా మంది పిల్లలను కనే వారు, ఆర్ధిక బాధలు కూడా ఉండేవి. అప్పుడు ఉన్నత చదువులు లేకున్నా లోకజ్ఞానం ఉండేది. నాకు తెలిసినంతలో అప్పటి రోజులే బాగుండేవి. ఇప్పుడున్న పరిస్థితులు చూడండి ఇద్దరూ చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నా లోక జ్ఞానం తెలియక ఒకరి మనసు ఒకరు అర్ధం చేసుకోకుండా గొడవలతో విడిపోతున్నారు. ఇష్టపడి పెళ్ళి చేసుకున్న వారు కూడా ఉన్నారు, వారి మధ్య గొడవలు కూడా ఉన్నాయి. ఇప్పటి రోజుల్లో ఎన్ని కుటుంబాలు కలిసి ఉన్నాయి? పెండ్లి చేసుకున్న సంవత్సరంలోనే విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. కాల ప్రభావం ఓపిక లేకపోవడం, ఇద్దరూ సంపాదిస్తున్నామనెే పోటీ ప్రభావం ఉండటంతో ఎక్కువగా జంటలు విడిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిచెడ్డలను తెలియజేస్తూ స్త్రీ తన కాళ్ళపై తను నిలబడే శక్తిని నేర్పాలి. తన విలువలను తెలియజేయాలి. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తనది తాను ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలి మనము అప్పుడే మనం బావుంటాం, స్త్రీలు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. అప్పుడే ధైర్యంగా తల్లిదండ్రులు నిద్రపోగలుగుతారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!