భావి భారత పౌరులు (గేయం)

భావి భారత పౌరులు (గేయం)

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: దొడ్డపనేని శ్రీవిద్య 

బుజ్జి బుజ్జి బాలలు

చిట్టి పొట్టి చిన్నారులు

బంగారు బంగారు మా బాలలు

బుద్దిగ మాట వినే బుడతలు

బుంగమూతి పెట్టే ముద్దు బాలలు

బడిలో ఆడి పాడే మా చిన్నారులు

                !!బుజ్జి బుజ్జి!!

ఎగిరే పక్షులను చూసి ముచ్చటపడేరు

నింగిలోని తారల్లా వెలిగిపోతారు

కల్లా కపటం ఎరగని పౌరులవుతారు

మానవత్వమే మా మతమని అంటారు

                 !!బుజ్జి బుజ్జి!

తోటలోని పువ్వుల్లా ప్రేమనే పంచేరు

గౌరవంతో గురువునే పూజించేరు

చక చక చదువులే చక్కగ చదివేరు

కిల కిల నవ్వుతూ పాటలే పాడేరు

                !!బుజ్జి బుజ్జి!!

భావి భారత దేశ పౌరులై మెలిగేరు

సోమరితనం వీడి పనులే చక్కబెట్టేరు

దేశ ప్రగతికే వెన్నెముకై నడిచేరు

బాల మేధస్సుతో అందరినీ అబ్బురపరిచేరు

                !!బుజ్జి బుజ్జి!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!