బాలలం (కవిత)
(తపస్వి మనోహరం – మనోహరి)
రచన: మోటూరి శాంతకుమారి
బాలలం మేము బాలలం
తీగలం మేము పూతీగలం
ఆసరా ఇస్తే అల్లుకు పోతాం
పువ్వులం మేము సుకుమారులం
పరిమళం వెదజల్లే పుష్పాలం
మా పై శ్రద్ధ చూపిస్తే
ప్రేమకురిపిస్తే
చక చక పెరిగి
బిరబిర నడిచి
బుడి బుడి మాటలు చెప్పి
పకపక నవ్విస్తాం
మాకు చాకోలెట్లొద్దు బిస్కెట్లొద్దు
అమ్మ నాన్న ప్రేమ కావాలి
ఇద్దరూ కలిసి మమ్మల్ని ప్రేమించాలి
అప్పుడు మేము అద్భుతాలుచేసేస్తాం..