చిట్టి తల్లి (కవిత)

చిట్టి తల్లి (కవిత)

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: అరుణ డేనియల్ 

నేనే నీ చిట్టితల్లిని

నీ వాకిట చిరు పువ్వును

నా నవ్వులతో నీ లోగిలి నిండింది

నా అల్లరితో ఆటపాటలతో నీ వాకిలి మురిసింది

నా ఉరుకులు పరుగులతో నీ ఇల్లు కళకళలాడింది

ఇంతలోనే ఏమైందని నన్ను కట్టడి చేసావు

నేను ఏ పాపం చేసానని ఈ బాల్యవివాహం

నాన్న అంతలోనే నన్ను నీ హృదయం నుంచి చేసావు దూరం

అందమైన నా బాల్యాన్ని అంతలోనే తుంచేసావు

నా ఆట పాటలను మధ్యలోనే రోదనగా మార్చేసావు

నా కలల ప్రపంచంలో నుంచి నిర్దాక్షిణ్యంగా తోసేసావు

నీ రాజకుమార్తెను రాక్షసులకు అప్పగించేసావు

నాన్న నేను నీకు బరువయ్యానా వదిలించుకున్నావు

నా స్నేహితులకు దూరం చేసావు

నా చదువులకు దూరం చేసావు

నా కుటుంబ సభ్యులకు దూరం చేసావు

నా ఇంటికి నా ఊరికి దూరం చేసావు

నాన్న ఆడపిల్ల ఈడపిల్ల కాదని వదిలించుకున్నావా

ఏడుపు వస్తే ఎవరు ఓదారుస్తారు

ఆకలి వేస్తే ఎవరు అన్నం పెడతారు

నిద్ర వస్తే ఎవరు లాలి పాడతారు

చిన్న వయసులో ఈ భాథ్యత ఎలా మోయగలను

మనసు ఒకచోట మనువు ఒకచోట

నన్ను నాకే దూరం చేసావు

నాన్న సాంప్రదాయం పేరుతో పంపించేసావా…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!