శాశ్వత ముగ్గులు
(తపస్వి మనోహరం – మనోహరి)
రచన: నారు మంచి వాణి ప్రభాకరి
ముగ్గుల అలంకరణ
సూర్యోదయం మొదలు ఇంటి ముందు ముగ్గు ఒక శుభ ప్రద అలకారము.
1. పూర్వం మాదిరి రోజు ముగ్గు పెట్టే తీరిక లేక పండుగకి మాత్రం పెడతారు. ఇప్పుడు మార్కెట్ లో వచ్చే మెరిసే రాళ్ళు మెరుస్తూ ఉన్న రంగులతో ఈ ముగ్గులు పెట్టాలి.
2. థర్మ కొల్ ప్లేట్స్ పేపర్స్ ఉంటాయి. వాటిపై ముగ్గు పెన్సిల్ స్కెచ్ వేసి, గమ్ రాసి, బిళ్ళలు రాళ్ళు మెరుస్తూ ఉన్న రంగు పొడి వేసి చెయ్యాలి. ఒక్కోసారి రాళ్ళు, బిళ్ళలు సూది దారం తో కుట్టాలి.
3. ముందుగా థర్మకోల్ ప్లేట్ పై చుక్కలు పెట్టీ, ఆ చుక్కలను డిజైన్ ప్రకారం ముగ్గులు మెరిసే కలర్స్ తో కలపాలి. ఈ తరహా ముగ్గులు పింగాణీ ప్లేట్స్ చెక్క ముక్కలు, దళ సరి వస్త్రం పై కుట్టి, గోడకు అలంకరించిన ఎంతో అందంగా ఉంటాయి.
4. ఈ తరహా చేసిన ప్లేట్స్ ప్రత్యేక సందర్భాలలో ఇంటి లోపల అలంకరించ వచ్చును.
5. గాజు డిష్ లు ఇత్తడి పాత్రలు నీళ్లతో నింపి, చంకి వేసి, పువ్వులు వేసి అలంకరించి, చుట్టూ ఈ ముగ్గులు పళ్ళాలు పెడితే ఎంతో శోభాయమానంగా ఉంటాయి.
6. కొత్త సంవత్సారాలు సంక్రాంతి అంటేనే రంగు రంగుల ముగ్గులు అక్షరాల్లో పెడతారు. ఈ అక్షరాలు కొందరు తెలుగులో మరికొందరు ఇంగ్లీష్ లో రాస్తారు. దీన్ని డిజైన్ తో రాస్తే మోనోగ్రామ్ కళా అంటారు.
7. ముందుగానే కావాల్సిన డిజైన్ లు లేక ముగ్గులు రెడీ చేసుకుని అవి కుట్టాలి. ఆంట్ రంగు దారం సూది ఉండాలి లేదా గమ్ ఉండాలి.
8. తెలుగు లోని 56 అక్షరాలతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చెయ్యమని కమిటీ వారు చెప్పారు. ఆ ప్రకారం 5-1/2 గంటల్లో, 56 అక్షరాలకి సృజనలో కళా రూపాన్ని ఇచ్చి, అనంతరం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను. లైన్ గవెర్నర్ చేత ఎగ్జిబిష న్ నిర్వహించాను.
9. ఈ తరహా శాశ్వత ముగ్గులు ముందుగా తయారు చేసి ఉంచితే బహుమతిగా ఇవ్వవచ్చును. మనింట్లో పండుగలలో అందంగా ప్రతి గదిలో పెట్టీ, వీటిపై పింగాణి బ్రాస్ పూల కుండీలు అలంకరించవచ్చును.
10.ఈ అలంకరణకు అందమైన పాత్రలు, పువ్వులు, మెరిసే రంగు కాగితాలు, మనకు వచ్చిన బహుమతుల, ప్యాకింగ్ పేపర్స్, పూచిక పుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు, కప్పులు అన్ని వాడవచ్చును.
వ్యర్థాలతో కళాత్మక అర్ధాలు అలంకరణలు ఎన్నో మీ సృజనకు సొంతమే బెస్ట్ ఆఫ్ లక్. శుభాకాంక్షలు అభినందనలు.