ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం

ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం

(తపస్వి మనోహరం – మనోహరి)

వివరణ: మోపిదేవి గౌతమి

చిత్రం: ఆ నలుగురు
రచన: చైతన్య ప్రసాద్

పల్లవి :
ఒక్కడై రావడం
ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధిలీల..
పాట విశ్లేషణ:
ఒక్కడుగా భూమి పైకి జననం ద్వారా వచ్చి, ఒక్కడు గానే మరణం ద్వారా ఈ భూమి పై నుండి వెళ్లిపోతారు. జననం, మరణం మధ్య జరిగే జీవితమంతా విధి లీల. వెంట ఏ బంధము రాదు, రక్తసంబంధం కూడా..
భార్య గుమ్మం దాక వస్తుంది. తల్లి, సోదరి వీధి గుమ్మం దాక వస్తారు. కొడుకు, స్నేహితుడు, భర్త, బంధువులు చితి దాక వస్తారు. కానీ.. ఎవరు తోడు వస్తారు, చివరకు వెళ్ళేది.. ఒక్కడు గానే..
మరణం ఖచ్చితంగా ఖాయం.. అది వచ్చే తీరుతుంది. మరణం తర్వాత మిగిలేది, ఆ మనిషి యొక్క రూపాన్ని  మనకు చూపించే ఛాయాచిత్రం లేక విగ్రహం అంతే. కానీ వారి కీర్తి మాత్రం చిరస్మరణీయం. అందుకనే ఎంతోమంది మహానుభావులు చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత కూడా, వారిని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే కారణం వాళ్ళ గొప్ప కీర్తియే, అని చెప్పడంలో సందేహం లేదు.
నీ బరువును, పరువును నీ వాళ్లనుకున్న, ఇంకా నీ చుట్టూ  సమాజంలో వున్న, నిన్ను చూస్తున్న ఆ నలుగురు మోస్తారు, జీవిత కాలంలో నీ పరువును, తుది కాలంలో ప్రాణం లేని నీ కాయమను.
రాజు అని పేద అని, మంచి అని చెడ్డ అని భేదం లేదు, యమపాసానికి. అది ఖచ్చితంగా అందరిని తీసుకునే వెల్లితీరుతుంది.
యమపాశం నిన్ను అంటుతున్న, ఆ తుది సమయాన, నీది అనుకున్న ఒక్క ఐశ్వర్యం, నీవు అనుభవించిన కటిక దారిద్రం అనే హద్దులు చెరిపి, మరు భూమి నిన్ను మరణ శయ్య పై పడుకోబెడుతుంది.
ఎంత ధనాన్ని మూటలలో దాచిన, అది చెయ్యదు నీతో సహగమనం. చనిపోయిన వ్యక్తి వెంట నడిచేది ధనమో ఐశ్వర్యమో..! కాదు ఆ నలుగురే. నీ విలువలు నచ్చి, నలుగురు మెచ్చిన, ఇంకో నలుగురు, నీ విలువలను వెక్కిరించి విసుగుగా తిట్టిన, మంచి నైతిక విలువలను శిలువగా మోస్తూ జీవించావు.
నీ చుట్టూ ఉన్న అందరికీ సంతోషాన్ని కలిగించే మార్గాన్ని వేశావు. విలువలే ప్రాణంగా బ్రతికిన ఓ మంచి మనిషి..! అంతిమ సమయాన నీ వెళ్ళేది ఒంటరిగా కాదు. నీ కాడి మొసేది ఆ నలుగురు మాత్రమే కాదు. నలుగురు, పదుగురిగా, పదుగురు వేల వందలుగా.
నీకోసం కాక, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సంతోషానికి కారకుడైన నీ జీవన విధానానికి దాసోహం అయ్యి. నీ వెనుక అనుచరులై నడిచారు చితి వరకు. మంచిని నేర్పి, సంతోషాన్ని ఇచ్చి, తోడుగా, బాసటగా నీవు నిలిచిన ఆ నలుగురు, ఆ నలుగురు అంటున్నారు.
పోయిరా నేస్తమా..
నీ వెళ్లినా.. మళ్లీ రా..
పోయిరా ప్రియతమా..
మేము ఇష్టపడే ఓ మనుగడ
నీవు మరలా రా..
నీవు మా గుండెలో నిలిచిపోయావు..
నీవు శరీరం వదిలిన,
ఆత్మ..నిత్యమై ఇలలో నిలిచిపోయావు..
జననం, మరణం మధ్య ఉన్న ఈ జీవితమంతా సత్యం. అందుకే, చెదరక నిలిచి పోయావు చిరకాలం. మరి అలా బ్రతికావు, నీవు మా చుట్టూ నీ జీవితకాలం…
బ్రతికిన నాడు బాసటగా ఉన్నావు..
నీవు ఓడినా.. కూడా ఊరటగానే ఉన్నావు..
నీవెంతో అభిమానంగా, అనురాగంతో..
క్షేమాన్ని కోరుతూ, బాసటగా ఊరటగా.. ఉన్న నీవు, భవ బంధాలు దాటి వెళుతున్న ఈ అంతిమ సమయాన..
జీవితాంతం తోడుగా నిలిచిన మీ ఔనత్యానికి, మేము ఉన్నాం.. మీ అంతిమ యాత్రలో ఆ నలుగురం ఒక్కడుగ భూమి పైకి వచ్చి, ఒక్కడు గానే ఈ భూమి పై నుండి వెళ్లిపోయే ఈమధ్య జీవితకాలం మొత్తం విదిలీల. చివరికి మిగిలేది, కీర్తి మాత్రమే..!
ధనమో, దారిద్రమో రాదు వెంట. తుది సమయాన తడి కన్నులతో వచ్చేది ఆ నలుగురే..! గొప్ప నైతిక విలువలు కలిగి, తన కోసం కాక, తనతో పాటు బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి హితాన్ని కోరే.. ఒక గొప్ప వ్యక్తికి నలుగురు ఎప్పుడూ తోడు ఉంటారు. తుది సమయాన తడి కన్నులతో చితి దాకా వెంట వస్తారు.
ఒక్కడే భూమి పైకి వచ్చినా, ఒక్కడై పోయినా, నీ కీర్తితో నిన్ను మోసే నలుగురిని, చితిదాక అయిన నీ వెంట వచ్చే, నలుగురిని పొందటమే నీ జీవిత పరమార్ధం అని. గొప్ప పదజాలంతో, ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని విశిదీకరించిన, ఈ పాట మానవ మనుగడకు అద్భుతమైన సోపానం.
ఈ పాట వింటూ,కన్నీరు కార్చే, కరిగిన ప్రతి గుండె తెలుసుకోవలసిన జీవిత సత్యం. జీవిత రాగ పద జావలి. జాలువారినది గౌరవనీయులైన రచయిత శ్రీ చైతన్య ప్రసాద్ గారి కలము నుండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!