గృహ శోభ

గృహ శోభ

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: K. లక్ష్మీ శైలజ

‘ఇంటికి ఇల్లాలే అందం’ అయినా ‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడ’ మన్నారు కనుక చిన్న చిన్న చిట్కాలు, సూచనలు మనం పాటిద్దాం.
ఇల్లు అందంగా వుండాలంటే మొదట ఇంట్లో ఫర్నీచర్ ను ఒక క్రమ పద్ధతిలో సర్దిపెట్టి ఉంచాలి. (సోఫాసెట్, కుర్చీలు, టీపాయ్,ఫ్లవర్ వాజ్ మొదలైనవి). ఆ ఫర్నీచర్ ను ఒక నిర్ధిష్టమైన వారం… అంటే గురు, లేదా ఆది ఇలా ఏదో ఒక వారం ఒక పాత కాటన్ దిండు కవర్, లేదా పాత బెడ్ షీట్ ముక్క తీసుకొని తుడుచుకోవాలి. థిక్ కలర్ (ex.వక్క కలర్) ఫర్నీచర్ మీద డస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. లైట్ కలర్ ఫర్నీచర్ తీసుకుంటే కొంచెం మేలు.
బూజు కనీసం 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి. కిటికీలు కనీసం నెలకు ఒకసారి క్లాత్ తో తుడుచుకోవాలి. (ఈ డేట్ ను నోట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడూ క్లీన్ చెయ్యాలో ఐడియా వుంటుంది). కిటికీల కర్టన్ లు, సోఫా కవర్లు, టీపాయ్ కవర్లు కనీసం మూడు నెలలకు ఒకసారి వాష్ చేయ్యాలి. లేదంటే కర్టన్, కవర్ కదిలించినప్పుడల్లా వాటి కుండే డస్ట్ గాలిలో ఎగురుతుంది. కర్టన్లు, కవర్ లు కొనవచ్చు, లేదా కుట్లు అల్లికలతో చేసినవి వేసుకుంటే మనం స్వంతంగా తయారు చేసుకున్న తృప్తి కూడా వుంటుంది.
వంటింట్లో స్టౌవ్ పక్కన అందరూ నూనె డబ్బాలను ఉంచుతారు. ఆ డబ్బాలు వారానికి ఒకసారి మార్చాలి. లేదంటే ఆ డబ్బాల పైన ఉన్న నూనె డస్ట్ క్యాచ్ చేయడం వల్ల చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. వంటింట్లో కూడా స్టౌవ్ దగ్గర తుడిచే బట్టలు ప్రతీసారీ తుడిచినప్పుడల్లా వాష్ చేస్తే జిడ్డుగా కనిపించవు.
బాత్రూంలో  విడిచిన బట్టలు వేలాడేలా వెయ్యకుండా ఒక ప్లాస్టిక్ టబ్ లో ఉంచడం చేయ్యాలి. స్నానం తరువాత ఒక బకెట్ నీళ్ళు బాత్రూంలో పోస్తే సోప్, షాంపూల వల్ల జారే ప్రమాదముండదు.
ప్రతీ బెడ్రూం లో ఒక టవల్ రాడ్ ఉంచుకోవాలి. తుడుచుకున్న టవల్స్ ను ఆ రాడ్ మీద ఆరెయ్యాలి. కుర్చీల మీద, సోఫాల మీద ఆరెయ్యకుండా. ప్రతిసారీ వాష్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉండే తీగల మీద ఆరేయ్యలేరు కదా.
ఈవన్నీ చెయ్యడానికీ, చేసిన వాటిని అలాగే వుంచడానికీ కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!