వ్యక్తిత్వ వికాసం

వ్యక్తిత్వ వికాసం

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: అరుణ డేనియల్

గతంలో ఆడవారు గడప దాటకూడదు, చదువుకోకూడదు. పెళ్ళి వరకూ తండ్రి, ఆ తర్వాత భర్త సంరక్షణలో, పోషణలో ఉండాలి. ఆమె వ్యక్తిగత ఆలోచనలు ఇష్టాలతో ఎవరికి పనిలేదు. కొంతమంది మహిళామణులు మాత్రమే వారి కాళ్ళపై వారు నిలబడి ఉదాహరణగా నిలిచారు. ఆ రోజుల్లో పన్నెండు సంవత్సరాల వయసు రాగానే ఆమె కంటే వయసులో చాలా పెద్ద అయిన వ్యక్తికి ఆమెను ఇచ్చి వివాహ తంతు జరపడం, ఎవరూ ప్రశ్నించకపోవడం… ఇంకా మహిళలను ఇరుకున పెట్టింది.ఆమెను చాకిరీ చేసే యంత్రంలాగా, వారసులు నిచ్చే యంత్రంలాగా మాత్రమే సమాజం భావిస్తూ వచ్చింది. సమసమాజ స్థాపనలో స్త్రీలు కూడా భాగస్వాములని సమాజం మరిచింది. కాలం మారుతూ వచ్చింది. మహిళల ప్రాధాన్యత అందరికీ తెలిసివచ్చింది. ఆమె ఇంటినుంచి బయటకు అడుగుపెట్టే సందర్భాలు ఉత్పన్నమయ్యాయి. మహిళామణులు వారి కాళ్ళపై వారు నిలబడే సందర్భం ఒకరోజులో వచ్చింది కాదు… ఎంతో పోరాటం తరువాత ఈరోజు మనం చూస్తున్నాము. తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించడానికి ఎంత దూరమైనా పంపుతున్నారు. ఈ మార్పు ఆహ్వానించదగినది. వివాహ వయస్సు 18 నుండి 21 సంవత్సరాలకు పెంచడం చాలా శుభపరిణామం. అయితే మార్పు ఇంటి నుంచే మొదలు కావాలి. ఆడవారు పూర్తి స్థాయిలో మానసిక ఆరోగ్యం, అవగాహన, శారీరకంగా దృఢంగా తయారయ్యాక అపుడు మాత్రమే వివాహం జరపాలి. అది కూడా ఆడపిల్ల ఇష్టం పరిగణనలోకి తీసుకోవాలి. అంతవరకూ వారి విద్య, వారి ఎదుగుదల, వారి రక్షణ భారం తల్లిదండ్రులు వహించాలి. ఆడపిల్ల ఈడపిల్ల కాదు అనే బూజుపట్టిన తలంపు తీసివెయ్యాలి. ఆడపిల్ల భారం, బరువు అనే ఊహ వద్దు. ఆడపిల్లల వివాహం పూర్తి స్థాయిలో వ్యక్తిగా మారిన తరువాత 21 సంవత్సరాలకు, ఆమె చేతిలో ఒక ఉద్యోగం ఉన్న తర్వాత చేయడం ఉత్తమము. ఈ మార్పును స్వాగతం సుస్వాగతం పలుకుదాము. ఆడపిల్లలను ఆడుకునే వయసులో ఆడుకోనివ్వాలి. చదువునే వయసులో చదువుకోనివ్వాలి. త్వరగా ఒకతని చేతిలో పెడదామా అనే ఆలోచనవద్దు. 21 సంవత్సరాలు దాటాక ఆమె ఇష్టంతో, నచ్చిన వారికి ఇచ్చి వివాహం జరపడం ఎంతో శుభం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!