మూణ్ణాళ్ళ జీవితం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పి.వి.వి.యన్.రాజ కుమారి
మూణ్ణాళ్ళ జీవితం
సృష్టి కర్త ఆడించు నాటకం
పుట్టుక చావులు మధ్య
మనిషి జీవన పయనం.
పుట్టిన మనిషి గిట్టుట తధ్యం
ఈ మధ్య జరిగేదే జీవన యానం.
చనిపోతామని తెలిసినా,
చావంటే ఆదో భయం.
ఏమిటీ వింత జనజీవనం
బరువు బాధ్యతల మయం.
జీవితమంతా అయోమయం
ముందు చనిపోతానని తెలియడం
మనిషికి తీరని బాధల శోకం
బంధాలకు బంధీలైన జనం
విడవడుతుందని తెలియడం
మరపు రాని దుఃఖానికి కారణం
తల్లిదండ్రులు, భార్యా పిల్లలు
ఏమవుతారనే మనసు ఆక్రోశం
అప్పులు బాధలలో నలుగు బ్రతుకు
న్యాయం చేయలేక పోతున్నామనే బాధ
అందుకే అంటున్నా చనిపోతున్నామని
తెలియడం శాపమే కద మరి.