అపర చాణిక్యుడు
రచన: పిల్లి.హజరత్తయ్య
పోగుచేసిన సొమ్ముతో
పెద్ద చదువులు చదివి
ప్రజలకు నిస్వార్ధ సేవలందించినాడు
పట్టువదలని విక్రమార్కునిలా..!
ఆశయ సాధనకై
బ్రహ్మచర్య దీక్షను పూని
దేశ సేవలో పునీతమైనాడు
నిశీథి వేగుచుక్కలా..!
బార్డోలీ సత్యాగ్రహం నడిపి
బ్రిటిష్ వారి గుండెల్లో నిదురించి
బానిస సంకెళ్ళను త్రుంచినాడు
నిజమైన నాయకుడికి చిరునామాలా..!
పిల్ల సంస్థానాలను
తల్లి భారతి ఒడికి చేర్చి
దేశమాతను పులకింపజేసినాడు
భరతమాత ముద్దుబిడ్డలా..!
ప్రజా శ్రేయస్సుకై
రాజీలేని పోరాటం చేసి
సమిధిగా మారినాడు
స్వార్థమెరుగని తరువులా..!
రావణకాష్టంలా రగులుతున్న
దేశ విభజన అనిశ్చితిని
గాడిలో పెట్టినాడు
అపర చాణిక్యునిలా..!