అంశం: చీకటి వెలుగులు
చీకటి వెలుగులు
రచన: ఉండవిల్లి సుజాతా మూర్తి
సస రిరి గగ మమ
సమాగము అది
ఋతువులాగమము|సస|
కార్తీక మాస వైభవాలతో
సహస్ర లింగార్చనల తోడను
ఆధ్యాత్మికత నిండినదైన
శరదృతువుకు శిరసా నమామి|సస|
పగలు సెగలు తగ్గిననూ
రేతిరి సమయం పెరిగిననూ|పగలు|
నిస్సత్తువకు తావునీయకని
నియమాలిడినది మన శాస్త్రము కాదా|సస రిరి|
ద్వారము వెలుపల ప్రమిదలు నిడుతూ
జీవన ప్రగతిని కోరుకుందుము|ద్వా|
ఖగోళ భూగోళ సృష్టి రహస్యం
ముడిపడినది మన జీవిత నిత్యం|సస రిర