అంశం: చీకటి వెలుగులు
చీకటి వెలుగులు
రచన: సావిత్రి తోట “జాహ్నవి”
చీకటి వెంట వెలుగు
కష్టం వెంట సుఖం
సాయం వెనక మానవత్వం
మానవత్వం వెనుక సాయపడే గుణం
సర్థుబాటు వెనక బంధం
బంధం వెనుక ధైర్యం
ధైర్యం వెనుక ఆత్మవిశ్వాసం
ఒకదానితో ఒకటి ముడిపడిన
మనిషి జీవితం ధన్యం…
అవే సకలచర జాతుల నుండి మనిషిని
వేరు చేసే గుణాలు…
విజ్ఞాన, వైద్యుష్యాలు మానవ జాతికి
మణిమకుటాలు…
కాదనలేని నగ్నసత్యాలు.