రచన – నారు మంచి వాణి ప్రభాకరి
ఓ ఓం నటరాజ నీ నాట్యమే
జగతికి మూలాధారము
ఢమరుక నాదంతో
భాషకు భాష్యం చెప్పి
నీ మంజీర నాదంతో
ఝాతులను నేర్పి
సంగీత సాహిత్య రవళికి
ఊపిరి నిచ్చిన ఓ నటరాజ
అర్ధనారీశ్వర తత్వంతో
నీ నాట్య విన్యాసాలు
ఈ విశ్వ కళ్యాణ విన్యాసాలకు
జీవ రక్షణకు మూలాధారము
నీ నాట్యరవళి కళావాణిగా
సకల జగత్తుకు కాంతి కిరణాలు
నాదిర దిం నాదిర్ దిం నాదిర్ దిం నాదిర దిం
తక తకిట తక తకిట తక తకిట తక తకిట
తధిం గిణఠా తధిం గణత
తద్దిం గిణత తద్దిం గణత
త తకిట త తకిట త తకిట
త తకిట…
