అలుమగలు

అలుమగలు

చింతా రాంబాబు

రెండు కుటుంబాలను దగ్గరచేసి
రెండు మనసులను కలిపే
బంధం వివాహ బంధం
ఆలుమగలు సంసారమనే
బండికి రెండు చక్రాలు వారు
కష్టాలను పంచుకుంటూ
సంతోషాలలో ఒకరికొకరు
ములిగితేలుతూ..
సంసారమనే ప్రయాణం చేసే
జంటపక్షులు వారు
కోపాలను మేఘాలవాలె తేలుస్తూ..
ప్రేమ,ఆప్యాయతలు పంచుకుంటూ
బాధ్యతలను స్వీకరిస్తూ
బంధానికి విలువ ఇస్తూ
నిండు నూరేళ్లు ఒకరికొకరు
తోడు నీడగా నిలిచే బంధం
భార్య భర్తల అనుబంధం.
జగతిలో ఉంది ఈ బంధానికి సుస్థిర స్థానం
కాపాడుకోవాలి విదేశీ సంస్క్రతి
అంటకుండా మనందరం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!