శీతాకాల ఆనందాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణిప్రభా కరి
సూర్యోదయంలో మార్పు
శీతాకాలంలో గాలి మార్పు
చలిగాలులు వీస్తున్నప్పూడు
జాగింగ్ చేస్తూ ఆనందంతో
సుగంధ పరిమళ పుష్ప గాలులు
పిలుస్తూ పూల అందాలు చూస్తూ
పార్క్ అంతా జాగింగ్ చెయ్యడంలో
ప్రతి మనిషి ఆనందం చెప్పగలమా
సూర్య కిరణాలు మంచు దుప్పటి.
చీల్చుకుని భూమాతను
చేరడంలో మొక్కలు అన్ని ఆనంద పడతాయి
మంచు బిందువులు సూర్యకిరణాలుకి ఓదిగిపోయి
ముత్యాల్లా మెరుస్తూ మరిన్ని
సోయాగాలు సంతరించుకుని
ఆనందడోలలో ఆహ్లాద వీచికలు
అందిస్తూ మానవాళికి
విన్నూత్న స్పూర్తినిచ్చాయి