3096 డేస్

3096 డేస్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎన్.ధన లక్ష్మి

కరోనా మహమ్మారి తన ప్రతాపం మొదలు పెట్టగానే  ప్రపంచం మొత్తం  స్తంభించిపోయింది. ఎన్నో దేశాలు లాక్ డౌన్ బారిన పడ్డారు. మన దేశంలో కూడా లాక్ డౌన్ అమలు లోకి వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కసారిగా విపరీతమైన ఖాళీ సమయం దొరికింది. మనం ఇండ్లకు పరిమితం అయ్యము ఒంటరిగా ఉండడం వల్ల కొందరికి పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
మనకు అన్నీ సౌకర్యాలు చుట్టుపక్కల మన వారు ఉన్న సరే మనం ఒంటరితనాన్ని తట్టుకోలేక పోయాము కొన్ని సందర్భాల్లో. కానీ ఒక అమ్మాయి దాదాపు ఎనిమిది ఏళ్ళు ఒక రూంలో ఉంది. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయీ, ఏమిటి ఆ కథ?
ఆడుతూ పాడుతూ ఉండి 10 ఏళ్ల అమ్మాయి నటాచ మరియా కంపుస్క్ ని  ఒక్కడు కిడ్నాప్ చేసి ఎవరికి తెలియకుండా తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన ఒక చీకటి రూంలో ఉంచాడు. అది ఒకటి, రెండు సంవత్సరాలు కాదు ఏకంగా 8 ఏళ్ల ఉంచారు.
నటాచా మారియా కంపుస్క్ ఆస్ట్రేలియా నివాసి..
అమ్మ, నాన్న ఇద్దరు డివోర్స్. 10 మార్చి 1998 రోజున వాళ్ళ నాన్నను కలవడానికి వెళ్తుంటే వోల్ఫ్ గాంగా ప్రిక్లోపిల్ అనే సైకో కిడ్నాప్ చేశాడు.  అప్పుడు నటాచా మారియా కంపుస్క్ వయసు పది ఏళ్ళు  ప్రిక్లోపిల్ తనని ఒక చీకటి గదిలో బంధించారు. నటాచా ఎప్పుడు ఉదయం అవుతుందో, రాత్రి అవుతుందో కూడా తెలియదు. చిన్న బాత్రూం, బెడ్ ఏర్పాటు చేశాడు. ఎంతో బ్రతిమాలితే గానీ లైట్ ని ఏర్పాటు చేయలేదు. తనకి కేవలం బ్రెడ్, జాం ఇచ్చేవాడు. నటాచా ఎదురు తిరిగితే కొట్టేవాడు, ఫుడ్ పెట్టకుండా వేధించేవాడు. సైకో కి అమ్మ, బామ్మ ఉండేవారు. కాకపోతే తనతో కలిసి ఉండేవారు కాదు వేరే చోట ఉండే వారు. అసలు ఆ ఇంటిని చూస్తే ఇంటి లోపల ఒక వ్యక్తి బంధించబడి ఉందని ఎవరికి కూడా తెలియదు. ఒక రోజు సైకో షర్ట్ పై ఉన్న వెంట్రుకలను చూసి వాళ్ళమ్మ అడిగితే తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తప్పించుకున్నాడు. ఆ రోజు నటాచా కి వెంట్రుకలు మొత్తం తీసి గుండు చేసేశాడు. నరకం ఏంటో ప్రతి రోజు చూపేవాడు. ఎంతలా అంటే సైకో  చెప్పితేనే నవ్వాలి, ఏడవలి రాత్రులూ అయితే తన చేతికి , వాడి చేతికి కలిపి బ్యాండ్ వేసుకొని మరీ నరకం చూపేవాడు, తనకి 18 ఏళ్ళు వచ్చాక తనని గార్డెన్ కి ఒక రాత్రి తీసుకొని వెళ్ళాడు. ఆ రాత్రి మొదటిసారిగా చంద్రుడి వెలుగును, బయట ప్రపంచాన్ని చూసింది. ప్రతి రోజు గార్డెన్ క్లీన్ చేయడానికి  తీసుకొని వెళ్ళేవాడు. అప్పుడు మొట్ట మొదటి సారి వెలుగును చూసింది. ఎగురుతున్న పక్షిని చూసి తనకి రెక్కలు ఉంటే బాగా ఉండు! తను కూడా ఈ నరకం నుండి తప్పించుకొని స్వేచ్చగా పక్షి లాగ మేఘాలలో  తేలిపోయే దానిని కదా అని ఏడ్చింది. రోజు తన ఇల్లు మొత్తం నటాచా చేత క్లీన్ చేయమని చెప్పేవాడు వినకపోతే కొట్టేవాడు. ఒకసారి వెజిటబుల్ తీసుకోవడానికి మాల్ కి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా తనకి బెదిరించాడు. ఎవరికైనా చెప్పాలి అని చూస్తే నీతో పాటు, మాల్ లో ఉండేవాళ్ళును చంపేస్తాను అని తన దగ్గర ఉన్న గన్ చూపించాడు. ఇంకొక్కసారి బయట ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ కి చెప్పింది కానీ ఆ అమ్మాయి నమ్మలేదు. ఒక రోజు రేడియో ను గిఫ్ట్ గా తెచ్చి ఇచ్చాడు, అప్పుడు ఆ రేడియోలో తన అమ్మ, నాన్న తన కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారు అని చెప్పారు. ఎలాగైనా సరే తను అమ్మా నన్ను కలుసుకోవాలని సంకల్పంన్ని తన ఆయుధంగా మార్చుకుంది. ఒక రోజు ఆ సైకోని అడిగింది ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు అని అతను ఏమి చెప్పాడో అంటే ఒక రోజు సైకో ఒక షాప్ కి వెళ్ళినప్పుడు నటాచా అతడిని చూసి నవ్వింది అంటా, ఆ నవ్వు అతనికి నచ్చలేదు అంటా అందుకు కిడ్నాప్ చేశాను అని తాపీగా చెప్పాడు. 23 రోజున 2006 సైకో కార్ ను అమ్మేయాలి అనుకుంటున్న అని, నటాచాని కార్ ని క్లీన్ చేయమని చెప్పారు. క్లీన్ చేస్తున్నప్పుడు గేట్ ఓపెన్ లో ఉండడం గమనించింది. ఇంతలో సైకో గాడికి ఫోన్ వచ్చింది కావాలని వాక్యూమ్ క్లీనర్ సౌండ్ పెంచింది. వెళ్ళగానే తప్పించుకొని పారిపోయింది. కనపడిన ఒక లేడీ సాయంతో పోలీసులకు వివరాలు చెప్పి తన తల్లిదండ్రులను కలుసుకుంది. పోలీసులు నటాచ చిన్నప్పుడు తప్పిపోయినప్పుడు రకరకాల కోణాల్లో విచారించారు ఎక్కడ కూడా ఆనవాళ్లు కూడా దొరకలేదు. సైకో గాని పట్టుకోవాలని చూశారు కానీ వీడి వెళ్లే లోపు వాడు చనిపోయి ఉన్నారు.
నటాచ తన అనుభవాలను 3096 డేస్ అనే పేరుతో పుస్తకం రాశారు. ఈబుక్ ఆధారంగా జర్మనీలో 3096 డేస్ అనే మూవీ కూడా వచ్చింది. సైకో గాడు ఎన్నో కష్టాలు పెట్టినా సరే తన అమ్మ నాన్న కలుసుకోవాలని ఆశను సంకల్ప బలంన్ని ఆయుధంగా మార్చుకుని ప్రయత్నించి గెలిచింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!