రమ్య రస నాద గీతము (సంక్రాంతి కథల పోటీ)

రమ్య రస నాద గీతము
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడి కన్నా ముందు లేచి కూతుర్ని నిద్ర లేపి రెఢీ అవ్వు గొబ్బిళ్లు పెట్టాలి అన్నది.
ఇంత తెల్లార గట్ల చలిలోనా అన్నది రమ్య.
అవును మా అమ్మ నా చేత ధనుస్సు పూజ చేయించింది.
శ్రీ రంగ నాధుని వంటి మంచి భారత మీ నాన్న నన్ను ఏరీ కొరీ చేసుకున్నాడు పైసా కట్నం లేదు విష్ణుమూర్తి వంటి గొప్ప భర్త దొరకాలి అంటే ధనుస్సు పూజ చెయ్యాలి మన ఇంట మనకు అలవాటు మా అమ్మ చేత వాళ్ళ అమ్మ నా చేత మా అమ్మ నీ చేత నేను పూజ చెయ్యమని చెప్పేవారు. నేను నిన్ను కుడా చెయ్యమని చెపుతున్నాను.
నేను వీధిలో ముగ్గు పెట్టీ పళ్ళెంలో గొబ్బి దేవతను సర్థాను అంటూ లేపింది.
సరే అంటూ రమ్య రగ్గు మొడత పెట్టీ షెల్పిలో పెట్టీ వాష్ రూమ్ లోకి వెళ్ళింది.
పావు గంటలో తెమిలి పట్టు చీర కట్టుకుని వచ్చి ఫ్రిజ్ లోంచి చేమంతి బంతి నందివర్ధనం చామంతి పూలు బ్యాక్లు లు తీసుకుని వెళ్ళింది. అప్పటికే పూలతో అలంకరించి తల్లి జానకి రెడీ చేసి ఉంచింది.
ఈ లోగా కుక్కర్ విజిల్ వచ్చింది వెళ్లి ఆపి పో పూ వేసి పెరుగు గిన్నెలో ఉంచింది. కరివేప రెమ్మ దూచి వేసి ఉప్పు వేసి ఉంచింది. కుక్కర్ చల్లారాక విజిల్ తీసి అన్నం పళ్ళెంలో వేసి ఆర బెట్టి అన్నం కలిపింది రమ్య పూజ పూర్తి అయ్యేలోగా దద్దోజనం రెఢీ చేసింది.
రమ్య పూజ ముగించే టైమ్ కి దద్దోజనం కొంత గిన్నెలో పట్టుకెళ్ళి ఇచ్చింది మిగిలినది దేముడి గదిలో పెట్టింది .
రమ్య నివేదన చేసి లోపలికి తెచ్చింది.
ఈ లోగా హరి దాసు అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కేర్తనలు పాడుతూ చక్కగా నృత్యం చేస్తూ తంబురా వాయిస్తూ వచ్చాడు. విధి గుమ్మంలో నిలబడి పూర్తిగా కీర్తన పాడటం అలవాటు. లోపలి నుంచి జానకి వచ్చి బియ్యం అరటిపళ్ళు తెచ్చి దక్షిణ పెట్టీ ఇచ్చింది.
రమ్య కొంచెం ప్రసాదం కాగితం గిన్నెలో పెట్టీ పెట్టు అని చెప్పింది.
సరే అమ్మా అన్నది.
ధనుర్మాసంలో హరిదాసును గౌరవించి పంపడం సాక్షాత్తు విష్ణు రూపంగా గౌరవిస్తారు. అలాగే గంగిరెద్దు మేళం కొమ్మదాసరి బుడా బుక్కలా వారు మొదలైన కళా రూపాలు మనకి ఈ పండుగకు మాత్రమే వచ్చి దీవిస్తారు మనం వాళ్ళని గౌరవించాలి అని జానకి అంటుంది. పాత బట్టలు కూడా పంచి పెడుతుంది. నెల అంతా వచ్చి నగర సంకీర్తన చేసిన కళా కారుడుకి నెల చివరన వచ్చి కనిపించి నప్పుడు ఘనంగా శాలువా తో కొంత డబ్బు ఇచ్చి సత్కరించి పిండివంటలు ఇచ్చి పంపుతారు.
జానకి రమ్యకి సంగీతం కూడా నేర్పించింది. ఇంటర్ వరకు నేర్చు కొని మెడిసిన్ లో చేరింది. రమ్యకి మెడికల్ కాలేజిలో కూడా పాటల పోటీల్లో చాలా బహుమతులు వచ్చాయి. మెడికల్ కాలేజ్ సింగర్ గా ఇంటర్ కాలేజియేట్ ఫంక్షన్ లో బెస్ట్ సింగర్ అవార్డ్ వచ్చింది పెద్ద ట్రోఫీ కూడా ఇచ్చారు.
జానకి కూతురు ఎంత డాక్టర్ చదివినా మంచి భర్త వస్తేనే జీవితము అని ధనుస్సు పూజ చెయ్యాలని చెప్పింది.
రమ్యకు గొబ్బిపిడకల కోసం గొబ్బిళ్ళు పెట్టే అలవాటు ఉండటం వల్ల తల్లి మాట విన్నది. డాక్టర్ అయినా ఇంజినీర్ అయిన సరే ఆడపిల్ల పెళ్లి తరువాత అత్తింట మంచి పేరు తెచ్చుకోవాలి అందుకు తగిన మంచి పద్దతులు అలవాటు చేసుకోవాలి అంటుంది.
పద్ధతిగా నిద్ర లేచి ఇంటిపనులు వంట పనులు వచ్చి ఉండాలి మనం చేసినా మానినా ఆడపిల్లలు అన్ని నేర్చుకోవాలి అని చిన్నప్పటి నుంచి అనేది.
రమ్య అన్నగారు సతీష్ కి కూడా అన్ని పనులు రావాలని చిన్నతనం నుంచి కాఫీ కలుపుకుని తాగడం ఇడ్లీ ఉప్మా వంటి చిన్న అల్పాహారం వంటకాలు. కుక్కర్ లో అన్నం వండుకుని పప్పు టమోటా బంగళా దుంప వేపడం వంటివి వండటం నేర్చుకో అని నేర్పారు.
అమ్మ ఎప్పుడైనా ఊరు వెళ్ళినా చక్కగా కొబ్బరి మామిడి పచ్చడి టమోటా గోంగూర పచ్చడి బాగా నేర్చుకున్నాడు. అందుకే ఉద్యోగ ఊళ్ళో కూడా కుక్కర్ పెట్టుకుని వండుకుని తింటాడు. నిజానికి ఉన్న ఇంటికి హోటల్స్ కి దూరం ఉంటుంది. వంట వచ్చి ఉండటం ఎంత మంచిది అయింది అని ఎన్నో సార్లు కొడుకు తల్లిని పొగుడుతూ ఉంటాడు.
చిన్నప్పటి నుంచి పిల్లల పెంపకం బట్టే వాళ్ళ అభివృద్ది ఉంటుంది జానకి థియరీ ప్రకారం ఆడపిల్ల అయినా మగ పిల్లాడు అయినా సరే అన్ని పనులు చక్కగా నేర్పి పెంచింది. ఇప్పటికీ తన భర్తకి చేతిలో మంచి నీళ్ళ గ్లాసు అందిస్తే గాని తాగడు అందుకే పిల్లలను పెంచే రీతిలో అన్ని నేర్పింది.
సంక్రాంతికి పాటల పోటీ పెట్టారు అది కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని ఇప్పుడు జూమ్ లోనే కదా రమ్య నువ్వు కూడా పాడవే బహుమతి కన్నా ముందు ఒక డాక్టర్ కూడా పోటీలో పాల్గొన్న క్రెడిట్ వస్తుంది అన్నది.
సరే గూగుల్ ఫార్మ్ ఫీల్ చేసి పంపుతాను అన్నది. రమ్య ఫార్మ్ ఫీల్ చేసి పంపింది
వారం రోజుల తరువాత లింక్ పెట్టారు, అందరికీ సమయం ఇచ్చారు. అప్పటికి రమ్య బాగా సాధిక చేసింది. పోటీ కోసం మళ్లీ సంగీతం బైండ్ తీసి సాధన మొదలు పెట్టింది. కొన్ని అన్నమాచార్య కీర్తనలు సాధిక చేసింది. పట్నం సుబ్రహ్మణ్య ర్ కృతి కూడా రఘువంశ సుదాం బుది చంద్ర శ్రీ అన్న కృతి కూడా చేసింది.
ముందు వాతాపి పడాలి తరువాత సమాజవరగమన ఇలా సెట్ చేసుకుని అన్ని రెడీ చేసింది. ఆ రోజు రానే వచ్చింది మధ%

You May Also Like

error: Content is protected !!