పెరటి తోట (సంక్రాంతి కథల పోటీ)

పెరటి తోట
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ – 2022)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు మంచు దుప్పటినీ వెలుగు కిరణములతో చిలుకుంటు శరవేగంతో వస్తూ ఉంటే ఆయనకు స్వాగత పలకడానికి మానవాళి అంతా చలిలో కూడా నిద్ర లేచి అవు పెడ కళ్ళాపి జల్లి ముత్యాలు ముగ్గులు రత్న నాల రంగవల్లులు అలంకరించి లేపాక్షి నుంచి కోని తెచ్చిన బంగారు పీటపై వెండీ పళ్ళెంలో గొబ్బెమ్మలు పెట్టీ పసుపు కుంకుమ తో అలంకరించి మందార, గుమ్మడి, బంతి, చామంతి, గొబ్బి నిత్య మల్లె పువ్వులతో అలంకరించి అటుకులు, శెనగ పప్పు, ఎండు కొబ్బరి, బెల్లం, ఏలకుల కలిపిన ప్రసాదము నైవేద్యం పెట్టే దీవెనలు పొంది లోపలికి వస్తీ అమ్మమ్మ చక్కగా విష్ణు పూజ చేసి ఘుమ ఘుమలాడ బాల భోగం పళ్ళెంలో పెట్టీ రెడీగా ఉంటుంది. మనుమరాలు భవ్య రాగానే చేతులు కడిగి తినిపిస్తుంది మనవరాలికీ పోటీగా తాత రిటైర్డ్ కల్నాల్ గారు కూడా పట్టు పంచే కట్టుకుని నామం పెట్టుకుని అపర విష్ణుమూర్తిలా రెడీగా ఉంటారు కబుర్లు చెప్పుకుంటూ అంతా కలిసి ఆరోజు నైవేద్యం అల్పాహారంగా తింటారు.
ఈలోగా వీధిలో హరిదాసు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడుతూ వీధి గుమ్మంలో చిందులు వేస్తూ ఉంటాడు. పరుగున భవ్య తినడం ఆపి పళ్ళెంలో రెడీగా ఉంచిన బియ్యం కొబ్బరి కాయ పళ్ళు పట్టుకెళ్ళి ఆతని తల పాగ పై ఉన్న గుమ్మడికాయ గిన్నెలో అతన్ని కూర్చో నిచ్చి వేసి వచ్చి సంబర పడుతుంది. ఈలోగా తాత మూర్తి గారు వెళ్లి పేపర్ ప్లేట్ లో పులిహోర పెట్టీ ఇస్తారు. అతను భక్తిగా దాన్ని కళ్ళకు అద్దుకొని వీలుంటే తింటాడు లేదా జోలెలో పెట్టుకుని వెడతాడు. అది ధనుర్మాసం ఉదయ దినచర్య ఇప్పటికీ ఎంత సిటీలో ఉన్నా పిల్లలచేత గొబ్బిళ్లు పెట్టించి మన సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టే పెద్దలు ఉన్నారు.
కల్నల్ మూర్తి గారి భార్య ఈశ్వరి గారు మంచి కళా కారిణి కోడలు సాఫ్టు వేర్ ఇంజినీర్ కొడుకు డాక్టర్ వాళ్ళు జీవితాల్లో జీతాల్లో చాలా బిజీ వ్యక్తులు అయిన సరే సంక్రాంతి పండుగ కు ముందు తప్పక పిల్లల్ని బామ్మ తాత దగ్గరికి పంపుతారు. అదేవిధంగా కూతురు పిల్లలు ఇద్దరు కూడా అమ్మమ్మ తాత దగ్గరికి వస్తారు. రిటైర్ అయిన మూర్తి గారు వాళ్ళ పల్లెలో ఇల్లు రీమోడలింగ్ చేయించి ఆధునిక హంగులతో ఇల్లు పాలరాతి గదులు అన్ని ఏర్పాటు చేశారు.
తాతల నాటి ఇల్లు ఇంకొకటి ఉంది. అందులో పెళ్లి ళ్ళకి ఫంక్షన్ హాల్ మాదిరి ఇస్తు ఉంటారు ఒక్క కరెంట్ ఫర్నీచర్ ఖర్చు మాత్రం పుచ్చుకుంటూ ఉంటారు. హాల్ ఫ్రీ అనే చెప్పాలి అందులో గుమాస్తా కి కొంత జీతం కూడా ఉన్నది.
సంక్రాంతికి వారం రోజులు ముందు మనమలు వస్తారు పండుగ రేపు అనగా పిల్ల, అల్లుడు, కోడలు, కొడుకు వస్తారు అంతా కలిసి ఉల్లో బంధువులను కూడా పిలిచి ఒక రోజు భోజనాలు పెడతారు. బొమ్మల కొలువులు ఊరంతా ముగ్గుల పోటీలో పాల్గొన్న వార్కి చిన్న పెద్ద విడి వీడి బహుమతులు ఇస్తారు.
ఆ సంపాదించిన దాంట్లో ఓ పాతికవేల తీస్తే అన్ని కార్య క్రమాలు చక్కగా చెయ్యవచ్చును అని ఆయన ఆలోచన. పిల్లలు భార్య కూడా సహకరిస్తారు. మనుష్యులలో సృజన ఉంటే మానసిక రోగాలు ఉండవు అన్నది ఆయన ఉద్దేశ్యము ఆ ప్రకారం పిల్లలకి సినిమా పాటలు నృత్యాలు విచిత్ర వేషాలు పిండి వంటల పోటీలు పెడతారు. అన్ని కూడా ఊరందరికీ వాళ్ళ ఫంక్షన్ హల్ లో చేస్తారు. పండుగ వెళ్ళగానే ఆ ఊరు వారు మళ్లీ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. పల్లెల్లో రైతులు ఎంతో కోలాహలంగా కనుమ పండుగ చేస్తారు, ఎడ్ల పోటీలు కూడా పెడతారు.
మనిషి సంఘ జీవి ఎన్ని రోజులు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఆ ఊరు ప్రజల్లో కలిసి పోయి మూర్తిగారు మసలుతుంటారు. పిల్లలు కూడా పల్లెకు వచ్చి అన్ని తెలుసుకుంటారు. ప్రకృతి అంతా సుందరంగా ఈ సంక్రాంతి శోభతో నిండి ఉంటుంది అతిథి అభ్యాగతి అన్నది ఉండాలి అందుకే జానపద సంప్రదాయ కళలు అయిన బుడబుక్కల, గంగి రెద్దు, కొమ్మ దాసరి, పిట్టల దొర కోడి పుంజు అట, నూనె గుద్దల వాడు, జంగం, దేవర, సోది, లంబాడీ నృత్యం ఇవ్వన్నీ కూడా ప్రదర్శన ఏర్పాటు చేసి చానెల్ వారిని కూడా పిలిచి ఎంతో బాగా వారికి ప్రోత్సహిస్తారు. ప్రతి ఊరికి ఇలాంటి కళాత్మక దాతలు ఉంటేనే కళలు నిలబడతాయి అని మెచ్చుకోలు పొందారు.
మానవ జీవితంలో సంక్రాంతి నిజమైన క్రాంతి కదా రైతన్నను ఇంటి నిండా ధాన్య రాశులు తెచ్చి పెడతాడు గాదులు నిండి ధనలక్ష్మి తాండవం చేస్తుంది.
మన దేశ సంస్కృతి సంప్రదాయాలు కళలు సృజన ఇవ్వన్నీ కూడా ఎ దేశంలో ఉన్నా మరువ కూడదు ముఖ్యంగా భావితరాలకు అందించే దిశలో మూర్తి గారు ఈశ్వరి గారు ముందుకు వచ్చి వారు ఊరే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్య క్రమాలను పాల్గొనే అవకాశం ఇస్తారు.
నా నాటి బ్రతుకు నాటకము అన్ని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారం ఎరిగి జీవితాన్ని మరింత మందికి ఆదర్శంగా మలచుకుని ఉన్నారు అంతే కాదు ఎక్కువ భాగం పెరటి తోటలో కాలం గడుపుతారు. ఒక రోజు సుఖ పడాలి అంటే రాజు అవ్వు రెండు రోజులు సుఖ పడాలి అంటే కవి అవ్వు జీవిత కాలం సుఖపడాలి అంటే తోటమాలి అవ్వు అని ఒక ఇంగ్లీష్ కవి అన్నారు దాన్ని ఆదర్శంగా పెరటి తోట పెంచి కావాల్సిన పువ్వులు కూరగాయలు అన్ని కూడా సేంద్రియ పంటలు పండించి ఆరోగ్యకర జీవితానికి సంబంధించిన రిటైర్ అయ్యాక రెండవ జీవితం మొదలు పెట్టి వారి గ్రామంలోనే కాక చుట్టుపట్ల గ్రామాలకు కూడా ఆదర్శం అయ్యారు మూర్తి ఈశ్వరి దంపతులు.
రిటైర్ అయ్యి వచ్చాక ఈశ్వరి గారు నోములు పట్టి నంది కేషుడు నోము కూడా పూర్తి చేశారు. అందుకే ఆ ఊరు వారికి ఆదర్శ దంపతులు శివ పార్వతుల చిన్న పెద్ద ఎవరూ పిల్చినా పెళ్లికి వెళ్లి దీవించి వస్తారు.

సర్వే జనా సుఖినభవంతు శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!