నిజమైన ప్రేమ

నిజమైన ప్రేమ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కె.కె.తాయారు

వెన్నెల చల్లదనం ఆహ్లాదంగా ఉంది మనసుకు. మడత మంచం మీద పడుకున్నా మధుకర్ హాయిగా తనకి ఇష్టమైన పాట వింటూ దానితో పాటు కూని రాగాలు తీస్తూ ఉన్నాడు. ఎంత హాయి మధురక్షణం మదిలోని భావన ఆనందంలో ఏవో భావాలు పలికించలేవో, పలికించ నేరవో కానీ పులకింతనే తొందరగా ఇస్తాయి. రమణి పరిగెత్తుకొచ్చింది “మధుకర్” “మధుకర్” అని రెండుసార్లు గట్టిగా పిలిచింది. పిలిచినా వినకపోతే. చెయ్యి గట్టిగా పట్టుకొని రండి, అని ఈడ్చుకుంటూ వీధిలోకి తీసుకువెళ్తే, అక్కడ ఒక 60 సంవత్సరాల వ్యక్తి మూర్చబోయి కాళ్లు చేతులు కొట్టుకుంటూ కనిపించాడు. వెంటనే నీళ్లు తీసుకొని రండి, దాంతోపాటు తాళాలు తీసుకురండి, అని గబగబా అతన్ని కదలకుండా పట్టుకొని కూర్చున్నాడు ఈలోపున రమణి నీళ్లు, తాళాలు ఇనపకడ్డి ఒకటి తెచ్చింది. గబగబా అవి రెండు రెండు చేతుల్లో పెట్టి పట్టుకొని, నీళ్లు కొద్దికొద్దిగా జల్లుతూ కళ్ళు విప్పే వరకు సేవ చేశాడు. ఈలోపున రమణి విసిన కర్ర తెచ్చి విసరడం మొదలెట్టింది. అంతే కళ్లిప్పాడు. మంచినీళ్లు తాగుతారా!? అని సైగ చేసాడు. అతను వద్దని తల ఆడించాడు.
ఇలా వెళ్లి అలా పరిగెత్తుకొచ్చింది నీళ్లతోటి తాగమని పెద్దాయనకిఇచ్ఛింది. తాగిన తర్వాత పెద్దాయన బాధపడ్డాడు”ఎవరిని బాధ పెట్టకూడదని నేను చేసింది చూడు ఒకరికి తెద్దున ఇద్దరికీ తెద్దునా అందరికీ తెద్ధునాఅన్నట్టు”? అన్నారు.
“పరవాలేదండి మీ అడ్రస్ చెప్తే నేను నా బండి మీద మీ ఇంటి దగ్గర దింపుతా అన్నాడు” మధు “మళ్లీ బండిమీద కూర్చోగలరా” అన్నాడు?
“ఆయన దానికి ఏముంది కూర్చుంటాను”. పరవాలేదు” అన్నారు. అంతే ఇలా వెళ్లి అలా దింపి వచ్చేసాడు మధు. గేటు దగ్గరే ఎదురయింది రమణి మధు అన్నాడు చాలా థాంక్స్ అండి అని “అదేంటి నేను మీకు చెప్పాలి”, “కానీ మీరు అండి గిండి ఏమిటి రమణి అనండి” అంది. “అది కాదు.. అంటూ ఉంటే “ఏది కాదు నాకు మీరు మర్యాద ఇవ్వొద్దు నేనేం పరాయి దాన్నా!?” అంది. అనేసరికి ఆశ్చర్యపోయాడు మధు వెంటనే తేరుకొని, “కాదు మీకు నచ్చుతుందో” లేదో “చాలు చాలు నచ్చబట్టే అలా పరిగెత్తుకొచ్చి సొంత వాళ్ళ మీద చూపెట్టినట్టు చనువు చూపాను ఇది మీకు అర్థం అవ్వలేదా!” “పకపకా నవ్వాడు” “అర్థమైంది రమ్యా..గ.. కాదు కాదు రమ్య నాకు ఇలా ఇష్టం నీకు అనేసరికి” అంత వరకు ఉన్న గంభీరం. “చటుక్కున సిగ్గుని కప్పుకుంది”.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!