బామ్మకి సాటి లేనే లేరు

బామ్మకి సాటి లేనే లేరు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

బారెడు పొద్దెక్కింది లేవండర్రా లేవండి
తలపై నూనె పెట్టి అభ్యంగన స్నానం
చేయండర్రా చేయండి
భోగిమంటలు వేసి
కర్రి ఆవు పిడకలను వేయండర్రా వేయండి
సుబ్బు, బాబి, లచ్చి
ఎక్కడ రా మీరంతా
అంటు తలపై ముసుగు జారిన కాంతం మామ్మ
సంక్రాంతి పండుగ మూడు రోజులు చేసే హడావిడి
నేటి రోజున కనబడుతుందా
చీడ, పీడ పోయే పండుగరా అని
తిట్లపురాణమే దీవెనలుగా
పాలి కాపు అప్పిగాడితో
తోటలో పండిన కూరగాయలను తెప్పించి
మీకేమి తెలియదు చంటి, నాగన్నలని
ఏభై ఏళ్ళ నాన్నని కూర్చోబెట్టి
అమ్మ చేత పనిచేయించక
మడి మడి అంటు
అన్నీ తానై అంతా తానై
పండుగనాడు సందడి చేసి
నులకమంచం పై నన్ను చెల్లిని తనతో పాటు పడుక్కోబెట్టి రాముడు కథలు చెపుతు,
వినక పోతే మొట్టికాయపెట్టె కాంతం మామ్మ ఎవ్వరైనా, ఎంతటి వారైనా లెక్కచేయక
వాడు, వీడు అని సర్వనామన్ని ఉపయోగిస్తు ఊళ్ళో అందరికీ సలహాలిస్తు
పోయుకాలం, పిదప బుద్ధులని తిట్టే మామ్మ
కాంచనమాల, కన్నాంబలకు
సాటిలేరని పీలికగుడ్డలు
కట్టుకుని కట్టు బొట్టు లేని
నేటి తరం సినిమా వాళ్ళని
తిట్టే మామ్మ కింద నుంచి ఎక్కాలు వల్లించే మామ్మ
నా పిండాకుడు, నా శ్రాద్ధం చేతిలో చరవాణి, మాట స్పష్టతలేని, వేమన, సుమతీ శతకాలు రాని
వీళ్ళేమి తెలుగు మాస్టర్లని
తెలుగుకు తెగులు బట్టిందన్న మామ్మ నోటికి
తాళం వేసే నాధుడు భువిలో గలడా?
బామ్మకి సాటి లేనే లేరు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!