మగువ మనసు
(తపస్వి మనోహరం – మనోహరి)
రచన: సిద్ధగాని భాగ్యలక్ష్మి
ఆదమరచి నిద్రోతుంటే …
వెచ్చని ప్రేమ దుప్పటి కప్పావు…
పోద్దెక్కిందని టక్కున పని కోసం పరిగెడితే
పనులన్నీ చక్కబెట్టి
పోగలుగక్కే కాఫి ఇచ్చావు…
వంటావార్పులో
చేతికున్న గాజులవలే చేదోడు అయ్యావు
నరదిష్టి తగలకుండ నుదుటన సింధూరం దిద్ధావు
దిగులు చెంది మనసుముక్క కన్నీటిచుక్కై…
రాలి గుండెలమీద పడినపుడు
తాళిబొట్టువై కన్నీటి బొట్టును తుడిచావు..
మనకు మనకు మధ్య బేధాలు లేవని …
మెట్టలను ముద్దాడి మగువ మనసు దోచిన
మహరాజువయ్యావు…
కనులు తెరిచి చూస్తే కల ఆగి పోయింది…
కథ ముగిసి పోయింది….
కన్నుల్లో ఆగిన కలను
కలంతో కదిలిస్తా…
కొంటె ఊసులెన్నో కల్పించి రాస్తా..
