నా కలల రాకుమారుడు….
రాముడు కాదు లోక నిందతో సతిని వీడడు
భీముడు కాదు అన్నదమ్ములతో నన్ను పంచుకోడు
కృష్ణుడు కాదు సవతుల పోరు తెచ్చిపెట్టని వాడు
శివుడు కాదు తన శరీరంలో కీరిట భాగాన్ని పరస్త్రీకి పంచిపెట్టడు
గౌతముడు కాదు నిజం తెలియకుండా నన్ను అనుమానించడు
సూర్యుడు కాదు నన్ను దూరంగా ఉంచి బతకలేడు
చంద్రుడు కాదు అమావాస్యలో వదిలిపోడు
ఇంద్రుడు కాదు వేశ్యలతో శరీరాన్ని మలినం చేసుకోడు
అసలు దేవుడే కాదు నా బాధల్ని పట్టించుకోకుండా శిలలా ఉండిపోడు
నా కన్నీటిని తుడిచేవాడు కాదు అసలు కన్నీరు అంటే ఎంటో కూడా తెలియకుండా చూసేవాడు
నాకు నవ్వును తెప్పించేవాడు కాదు నా అదరాలకు మందహాసంను పరిచయం చేసిన వాడు
నా ఊపిరి ఆగిపోతే నా పార్ధీవదేహం ముందు కుమిలికుమిలి ఏడిచేవాడు కాదు నా ఊపిరికి తన ఊపిరి అడ్డుపెట్టేవాడు
రెక్కల గుర్రంపై రాలేడు కానీ ,నాకు ఎగరాలి అనిపిస్తే తన రెక్కలతో నన్ను ఎగిరెలా చేసేవాడు
కరావాలం చేతపట్టడు నన్నో చంటి పాపాల చూసి తన కరములతో గోరుముద్దలు పెడతాడు
రత్నాలు వజ్రాలు తీసుకురాడు ప్రతి రేయి తన వెచ్చని శ్వాసలో నన్ను బందీ చేస్తాడు
నీ రాకకై ఎదురు చూసే
నీ రాజకుమారి
రచన:ధరణి