నూతన విద్యా విధానం పై ఉపాధ్యాయుల పాత్ర
రచయిత :: జాదవ్ ముకుందరావు
వందనం వందనం వందనం వందనం
వందనం వందనం మాతృభాషకే వందనం,
ప్రాథమిక స్థాయిలో మాతృ భాష బోధనం
సంస్కృతి చరిత్రల విలువలను పొందడం !!
మొత్తం ప్రపంచంలో అంత
మహామారి కొరోనా కాలం ,
ప్రజలకే కష్టకాలం ఉన్న
భారతీయుల జీవితం !!
ప్రయోజనాలకై ఓ పథకం
అందులో కేంద్ర ప్రభుత్వం ,
నూతన విద్యా విధానం
ప్రతి ఒక్కరికి అదృష్టం !!
మానవతా విలువలు నైన
సత్య ధర్మము శాంతి ప్రేమ ,
ప్రక్రియని వ్యక్తపరిచేదే
వినయము గల విద్య బలమైన !!
విద్య పరమార్ధం రసం
సూర్యరశ్మి అంతా ప్రకాశం ,
మంచి వ్యక్తిత్వానికి ధనం
ప్రేమాభిమానాలకు ప్రతిబింబం !!
విద్యా తోడైతే మనకు ధైర్యం
స్వశక్తి మీద కలిగిన నమ్మకం ,
చేగుర్ ఏ సాంకేతిక రంగంలో సైతం విద్యావంతులైన వారంతా కేవలం !!
విద్యార్థులలో మానవత్వం సేవ
తోటి వారి పట్ల కరుణ దయ ,
విద్యార్థుల అనుకరణ లలో వివేకం
విద్యా విధానమే దేశానికి సుమనం !!
నీతి బోధన తో కూడిన మార్గం
సమాజాన్ని రక్షణనిచ్చే బలం ,
మానసిక స్థాయి కలిగి ఉండడం
అమూల్యమైన విద్య మన జీవితం !!
