ప్రతి అమ్మకథ

ప్రతి అమ్మకథ

రచయిత :: రమాకాంత్ మడిపెద్ది

“అమ్మా, ఉద్యోగం వచ్చిందంటూ ఎన్నో ఏండ్లుగా నువ్వు పడ్డ కష్టం కొన్నాళ్లుగా నేను కన్న కల నిజం అయ్యింది” అంటూ పట్టలేని ఆనందంతో ఉండబట్ట లేని తోందరతో
అత్రూతగా ఇంటి ముందుకు వచ్చిన నాకు గుమ్మం ముందు చెమర్చిన కళ్లతో, చెదిరిన జుట్టుతో కళ తప్పి వెలపోయిన మోముతో, నాన్న ఫోటో పట్టుకోని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి తాను విడిచిన, తనను విడిచి వెళ్ళిన తియ్యని గతంలోకి మళ్ళీ వెళ్లి, వెళ్తూ వెళ్తూ ఆ గతం మిగిల్చి వెళ్ళిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తప్పిపోయిన చిన్న పిల్లలా ఏడుస్తూ
ఆనకట్ట లేని నీళ్ళను కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా పారడం తప్ప ఆగడం తెలియని ఆడవారి కన్నీళ్లను కాసేపు ఆపేస్తాన్నట్లుగా తన కోంగుతో తడిసిన కళ్లను తుడుచుకుంటూ నన్ను చూసి వాడిన ముఖానికి నవ్వు రంగును పూసుకొని
“చాలా సంతోషం రా! నాన్న” అంటూ కౌగలించుకున్నప్పుడు నేను కూడా ఒక్కసారిగా మొదటి సారి అమ్మను కలిసిన  వెచ్చని పోతిళ్లలోకి వెళ్లిపోయా!

కాస్త అటుఇటుగా నాకు గుర్తు “అబ్బాయి పుట్టాడు అన్ని మారుస్తాడు అంతా బాగుంటుంది” అని అమ్మమ్మ అంటుంటే మా నానమ్మ, నన్ను చూడడానికి మాత్రమే వచ్చిన చుట్టాలు”తండ్రిని మింగిన నష్ట జాతకుడు” అంటూ తలో మాట అంటుంటే చేసేది ఏమిలేదని మా తలరాత ఇంతేనని ఏడుస్తూనే మా ఇద్దరి జీవితం మొదలైంది.

నాన్న లేని ఇంట్లో నేను ఉండలేను ఆయన తిరిగి ఇవ్వలేని ఆస్తి తనకు వద్దంటూ అన్నీంటిని అక్కడే వదిలి కట్టు బట్టలతో ఊరు తెలియని ఊరికి వచ్చి ఓ చిన్న గదిలో దోరికిన పని చేస్తూ ఒంటరిగా ఉందని జాలి కూడా  నీచంగా మాట్లాడే ఎన్నో నోర్లను నీచాతి నీచంగా చూసే ఎంతో మంది కళ్లను తప్పించుకుంటూ కన్నీళ్ళను దిగమింగుతూ ఒక్క పూట తింటూ,
మరో పూట పస్తులు ఉంటూ అమ్మ , నాన్న నాకు అన్ని తానై ఉన్న దాంట్లో నన్ను సుకుమారంగా తన కలల ప్రపంచానికి రాకుమారుడిలా చూసుకుంటూ తన జీవితం అనే డైరీలో ప్రతి పేజీని తన ఆశలనే ఇంకు పోసీ అనే  కలల అక్షరాలను నింపుతూ తన కంటూ ఓ జీవితం ఉందని మరిచి పోయిన అమ్మకు ఇకనుంచైనా ఉన్నంతలో ఉన్నంతకాలం కష్ట పెట్టకుండా కన్నీళ్లు పెట్టుకుండా చూసుకోవాలని తనకంటూ మిగిలిన ఈ చివరి పేజీల్లోనైన కోన్ని తియ్యని మాటలు నా చేతులతో రాయాలని అనుకుంటూ నేను ఓ కలకంటూ అమ్మ జోకోడుతూ తల నిమూరుతుంటే అమ్మ వెచ్చని ఊపిరి కళ్లను తాకుతూ ఉంటే నన్ను చూసి అమ్మ  మురిసిపోతుంటే ఇంటి లోగిలిలో అమ్మ ఒడిలో అలాగే పసిపిల్లాడిలా నిద్ర పోయాను….

***

You May Also Like

3 thoughts on “ప్రతి అమ్మకథ

  1. The impactable lines you written are the witnesses
    Of your writing caliber sir. Here the lines that are admairing:

    Ee chevare pagee lo naina kone tiyane matalu na cheteto
    Rayalanukuntu nenu oo kala kantu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!