అయితే ఏంటి?
రచన::రమాకాంత్ మడిపెద్ది
మాసిన గడ్డం అయితే ఏంటి?
నెరిసిన జుట్టు అయితే ఏంటి?
వయసు ముప్పై దాటితే ఏంటి?
వంటి రంగు నలుపు అయితే ఏంటి?
బక్క పలచని శరీరమే అయితే ఏంటి?
చేసేది ఒకటి చదివింది మరొకటి
అయింది ఒకటి అవ్వాలనుకున్నది ఇంకోటి
అయితే ఏంటి???????
అరకొర జీతం అయితే ఏంటి?
స్థిరం కాని ఉద్యోగం అయితే ఏంటి?
వ్యయం తప్ప ఆదాయం లేని రాశిఫలం అయితే ఏంటి?
నీ మాటపడని స్వభావాన్ని అహంభావం అనుకుంటే ఏంటి?
ఇచ్చిన మాట తప్పని నీ మంచిగుణాన్ని పిచ్చితనమని నలుగురు నవ్వుకుంటే ఏంటి?
ఒక్కసారి గెలిచిచూడు మిత్రమా!
నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి క్షణం వడ్డీతో సహా వెనక్కు వస్తుంది.
నిన్ను చూసి నవ్వుకున్న ఆ నలుగురే లోలోపల నీ ఎదుగుదలకు ఏడుస్తూ నీ ముందు కపాటపు నవ్వును నటిస్తూ నీ చుట్టూ చేరి భజన చేసేలా చెయ్యి చాచి నిన్ను దేహి అనేలా చేస్తుంది.
వెళ్ళిన ప్రతి చోట నీ పేరు చెప్పుకొని బతికేలా చేస్తుంది.
Simple and sooper