నీకోసం..

అంశం: ప్రేమలేఖ

నీకోసం..
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లగిశెట్టి ప్రభాకర్

చెలీ….
ఎన్నాళ్ళ నుండో రాద్దామనుకున్న ప్రేమలేఖ.. రాసే దైర్యం లేక  రాయలేక పోయాను. కానీ.. రాయకుండ ఉండలేక పోతున్న,
నా కలం నన్ను తొందర చేసింది మనసు పురి విప్పింది.
సరళరేఖలా చూస్తున్న నీ చూపు తట్టుకోలేక నేరుగా నిన్ను చూడలేక నా తనువు
వక్రరేఖలా వంకరలు తిరుగుతుంది. ఎంత వద్దనుకున్నా వృతంలా నా ఆలోచనలు
నీ చుట్టే ఆగక తిరుగుతున్నాయి. తొలిసారి.. హాయి అన్న నీ పిలుపు ఎండమావిలో ఒయాసిస్సులా
శీతాకాలంలో వెచ్చదనం లా నా తనువును తాకి
నా మది గదిలోకి చొచ్చుకొని పోయింది.
నన్ను నేను మైమరచి నాచుట్టూ నేను బొంగరంలా గుండ్రంగా భ్రమిస్తున్నాను.
ఆపై సూర్యుని చుట్టూ భుగోళంలా
నీ చుట్టూ పరిభ్రమిస్తూన్నాను.
నీపై నాకున్న ప్రేమ ఆకర్షణ కాదు, వ్యామోహం అంతకంటే కాదు
నా మనసు పలికిన మధుర భావన మనసా వాచా కర్మణా.. నిన్నే ప్రేమిస్తున్నాను.
నీ కోసం, నీ ఆత్మీయ స్పందనకోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తుంటాను

నిరంతరం నీకై తపించే …
సదా నీ క్షేమం కోరే..
నీ.. ప్రియదాసుడు.

You May Also Like

2 thoughts on “నీకోసం..

  1. మీ మనసులో ఉన్న మధుర భావనలు ప్రేమ లేఖ రూపంలో మనసును హత్తుకునేలా, మా చూపులను అక్షరాల వెంట పరిగెత్తించి మైమరపించింది.
    చాలా బాగా రాశారు.

  2. సరళరేఖలా మొదలై.. వక్రరేఖలా వయ్యారాలు తిరిగి.. వృత్తంలా చుట్టేసుకుని.. భూగోళం అంతా అల్లేసి అనంత ప్రేమను సూర్యకాంతిలా విశ్వమంతా ప్రసరింపచేసి.. ప్రకాశింపచేసి.. ప్రేయసిని ముగ్ధురాలిని చేసేస్తే ఇక ఎదురుచూపులతో పనిఏమిటి మాష్టర్ జీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!