ప్రకృతి ప్రేమ

అంశం: ప్రేమలేఖ

ప్రకృతి ప్రేమ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

ప్రియమైన అమ్మకి నాన్నకి

నేను చాలా బాగున్నాను, నాన్నగారు ఎలా ఉన్నారు. బామ్మగారు సుప్రభాతం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రపత్తతే అంటూ గంభీరంగా వినిపిస్తూ ఉంటుంది అంటూ ఉత్తరం మొదలు పెట్టింది. శ్రీ కళా మంచి కళాకారిణి ఆమె సదా ఆహ్లాదం జీవితంలో ఉంటుంది. ప్రకృతి ప్రేమ జీవితంలో ఎంతో ఆరోగ్యం ఆనందము. సూర్యదయాన్ని మెడ మీద ఉయ్యాలలో కూర్చుని లాప్టాప్ ఓపెన్ చేసి ప్రకృతి చిత్రం వేస్తూ ఉన్నది. ఉదయం సూర్యుడు ఎంతో అందంగా బంగారు కిరణాలతో ప్రకృతి అంతా పరుచుకున్నాయి. జాజిపూల సుగంధం సింహాచలం సంపెంగ పూలు పరిమళాలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. పారిజాతం పూలు ఎరుపు కాడ తెల్లని నక్షత్రాల్లా మెరుస్తున్నాయి, బోన్సాయ్ కుండిలలో ఉన్నాయి, గులాబీ కుండీలు ఓ నలభై ఉంటాయి మేడ మీద మిద్దె పూల వనంలో మహారాణిలా ఉయ్యాల ఊగుతు ఉంది.
భర్త శ్రీకర్ చాలా మంచివాడు. కళాత్మక దృష్టి ఉన్నవాడు, భార్య కళను అభినందిస్తారు. అత్తింటికి కూడా మొక్కలు కొన్ని పెళ్లి సారేతో పాటు తెచ్చుకున్నది ఇది మరీ చిత్రం అనుకుంటున్నారు కదా. పెళ్ళిలో కూడా మొక్కలు పంచి పెట్టారు.
శ్రీ వకుళ శ్రీ కళా అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కూడా బాగా డాన్స్ సంగీతం నేర్పించారు. శ్రీ వకుళ బెంగుళూర్ లో ఓ పెద్ద సాఫ్టు వేరే కంపెనీ లో ఉద్యోగం చేసే భారత్ తో పెళ్లి జరిగి వెళ్ళింది అక్కడ డాన్స్ క్లాస్లు చక్కగా చెపుతోంది.
అక్క పెళ్లి తరువాత శ్రీ కళకి పిజి చేస్తూ పెళ్లి ఇంకో రెండు సంవత్సరాలు ఆలస్యం అయింది. ఈ లోగా సంగీతం బాగా డెవలప్ చేసింది. ఆకుపచ్చని మొక్కలు మధ్య కోకిల రావాలు చెవులకి ఇంపుగా ఉన్నాయి. తూర్పు ఈశాన్యం నుంచి ఒక పిచ్చుక వచ్చి కూస్తోంది, అబ్బ ఎంత హాయిగా ఉన్నది. సరోజినీ నాయుడు గారి కాజురిన పోయేట్రిలో ఆకుల సవ్వడి గురించి ఎంత బాగా చెప్పింది. వర్డ్స్ వర్త్ పోయిట్రిలో కూడా ఎన్నో ప్రకృతి అందాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కదిలే ఆకులో విరిసే పువ్వులో ఊగే కొమ్మల్లో చెట్టున కాసిన పళ్ళు కూడా పల్లెల్లో ఎంతో మధురిమలు అని చెప్పాలి.
ఇలా ఆలోచిస్తూ ప్రకృతి అందాలు వర్ణిస్తూ చక్కగా చిన్న చిన్న బొమ్మలు వేస్తూ ఉత్తరం అమ్మకి రాసింది. మెయిల్ లో అమ్మకి పంపింది.
అత్త ఇంట్లో కూడా శ్రీ కళా ఒక కళాకారిణిగా ఎదుగుతూ ఉన్నది. ఇంట్ల వంటకి వంట మనిషి ఉన్నది పనికి పనిమనిషి, మాలి మొక్కలకి సేవ చెయ్యడానికి ఉన్నారు. ఇలా ఎన్నో అందాల మధ్య జీవితం కూడా ఎంతో అందంగా ఉన్నది. ఆడ పిల్ల పుటింట్లో యువరాణి, అత్తింటికి మహారాణి కదా అంటూ అంతా పొగిడారు
అలాగే శ్రీ కళా ఓ ఛానెల్ లో సీ యి వో గా ఉన్నాడు. ఇంట్లో అత్త మామ కూడా ప్రేమగా చూస్తారు. ప్రకృతి ప్రేమికులు ఎప్పుడు సుఖ పడతారు. ఇది ఎంతో ఆడపిల్లకి అదృష్టము.
ఉత్తరం చదవడంలో ఎంతో ఫీల్ ఉంటుంది. అదే వీడియో కాల్ లో మనుషులు కనిపిస్తారు కానీ చదివిన అనుభూతి ఉండదు కదా. ఇప్పుడు నిజానికి పెన్ కాగితం కంటే సెల్ ఫోన్ లేక లాప్ టాప్ లో టైపింగ్ మజా వేరే అనుకోగానే టైప్ చేసి పంపితే మమ్మీ ప్రింట్ చేసి నాన్నమ్మకి తాత గారికి ఇస్తుంది. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు.
ఇలా ఆలోచిస్తూ ఉత్తరం రాస్తుంటే, హలో మేడం గారు ఏమిటి నవల రాస్తున్నారా, ఉత్తరం రాస్తున్నారా అంటు ట్రెలో పెద్ద కప్పు నిండా బాదం మిల్క్ తెచ్చి పిలిచాడు. ఇవ్వాళ ప్రేమికుల రోజు కదా నీకు ప్రేమగా బాదం మిల్క్ ఇవ్వాలని అన్నాడు.
ఒకే సార్ అభినందనలు, మీరు వేరే ఫిలిమ్ పనిలో ఉన్నారు కదా అందుకని మిమ్మల్ని మాట్లాడి డిస్ట్రబ్ చెయ్యడం ఎందుకని పైకి వచ్చాను అని నవ్వింది.
అహ ఎవరైతే నేమి ఇద్దరం ఒక్కటేగా అన్నాడు.
సరే మేడం మీరు మీ పని పూర్తి చేసి రండి నేను ఆఫీస్ కి వెడుతున్నాను అంటూ శ్రీ కర్ కిందికి దిగాడు.
లేఖ అమ్మకి పోస్ట్ చేసి శ్రీ కళ కూడా కిందికి దిగింది . అక్కడ అత్తగారు వంట ఆమెకు సలహాలు ఇస్తోంది. ఇల్లంతా అందంగా సర్ధి మొక్కలు పెట్టీ ఉంటాయి. ఇత్తడి గంగాళంలో మరింత అందముగా ఉంటుంది. ఎక్కడికక్కడ అందంగా సరుకులు అమర్చి పెట్టి ఉన్నాయి
**
సింపుల్ లివింగ్ హై థింకింగ్.. అన్నట్లు ఇల్లు ఎంతో అందంగా పెడుతుంది కోడలు ఇష్ట ప్రకారం ఇల్లు సర్ధుకోమన్నది. ఈ తరం పిల్లలకు ఎన్నో ఆశలు ఆకంక్షలతో అత్త ఇంట అడుగు పెడతారు అని పూర్ణ కోడలు ఇష్ట ప్రకారం ఇల్లు సర్థుకోమన్నది.
శ్రీ కళా మాత్రం ఎంతో బాగా కళా రూపాలు అన్ని కూడా ఎన్నో రకాల బొమ్మలు పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, శ్రీ కాళహస్తి, అన్నవరం, శ్రీ శైలం, విజయవాడ, సింహచలం, కాశీ, హరిద్వార్, రుషికేశ్, మద్రాస్, విశాఖపట్నం, ఏటి కొప్పాక, నిర్మల్, కొండపల్లి బొమ్మలు ఎన్నో రకాలు అందంగా గాజు బీరువాలలో అమర్చి వున్నాయి. మరో దాంట్లో ఎన్నో మేమొంటోలు ఉన్నాయి.
కళలు అన్న ప్రకృతి అన్న ఇష్టమైన శ్రీ కళకు కళను ప్రేమించే కుటుంబం అవ్వడం వల్ల ఇంకా ప్రేమ పెరిగింది. ఇంట్లో ఆమె కళా ప్రేమ అందరికి ఇష్టమే అందుకే నానాటి బ్రతుకు నాటకము అన్న శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలలో చేప్పే సారాంశము కదా ఇది అందుకే మనం అంతా కూడా కళలు ద్వారా ప్రేమను పంచి అటు జీవితానికి కళకు విలువనిచ్చి ప్రేమను ఎంతో ప్రియముగా పెంచాలి, అదే కదా మనకు వాగ్గేయకారులు కవులు చెప్పేది ప్రకృతి కళా రూపంలో ప్రేమించు అన్నారు.

ప్రేమను పంచి ఆనందం పొందాలి శాంతి శుభము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!