జ్ఞాపకాలు

అంశం : మన్మధ బాణం,

జ్ఞాపకాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

గుర్తుకు రాకూడని తియ్యటి ప్రేమ స్మృతులు,
గతించిన మన ప్రేమ రోజులు, చేసుకొన్న బాసలు,
నీ మనసు ఒక చిలక అయితే, బంగారు పంజరంలో భద్రంగా ఉంచేవాడిని,
నీకు రత్నాల హారం తొడిగి, కంటికి రెప్పలా కాపాడుకుంటా నా చెలీ,
నీ చిత్రపటాన్ని  నా మనసులొనే ముద్రించుకొన్నాను,
నా హృదయ ప్రకంపనలు నీ మనసును తాకని,
నన్ను వదిలి వెళ్లిపోయిన రోజు నా ఆఖరి రోజు,
నీ జ్ఞాపకాల నీడలు నా పాలిట ప్రేమ వరాలు,
నీకోసం పరితపించని క్షణం లేదు,
మన ఇద్దరి సంగమం, దైవ నిర్ణయం!
నీకోసం నేను సంధించిన ఈ ‘మన్మధబాణం’
అనుక్షణం నిన్ను వెంటాడుతూ,
నీ బంగారు హృదయాన్ని స్వచ్ఛమైన నా ప్రేమతో నింపేస్తుంది.
“నీ పవిత్ర ప్రేమ కోసం అర్రులు చాచె
ప్రేమ చకోరాన్ని నేను ప్రియా.!!!”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!