(అంశం :: “విమర్శించుట తగునా”)
ఆత్మ విమర్శ
రచన::P.V.N.కృష్ణవేణి
తప్పు చేయని మానవుడు లేడు
తప్పు ఎత్తి చూపని మహాపురుషుడు లేడు
విమర్శ మన మంచికే అని భావించు
నీకు నువ్వే ఆత్మ పరిశీలన గావించు
పెదవి మాటే కదా అని నోరు జారకు
ఆ మాటే గుండెను చీల్చునని గమనించు
చేసే ప్రతి పనిని విమర్శించుట తగునా
మంచి మాటలతో మదిని గెలువు
ఏ రంగంలోనైనా ఎదగాలనే ఆశ
భాధ్యతల పేరుతో అనిచివేసెను
కుటుంబంతో కలసిపోవాల్సి ఉండేను
కొత్తగా ప్రయత్నించ మొడలిడెను
బయట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విమర్శకులే
తప్పు దొరికే వరకూ అందరూ మహాజ్ఞానులే
వారి లోటు పాట్లు వారికి ఎరుకేనా
మనల్ని విమర్శ చేయుట సబబెనా!!