ప్రేయసి 

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ప్రేయసి 

రచన: చెరుకు శైలజ

మదిలో కోరికలు మంతన మాడగా
నా మనసేమో నా మాట వినదాయే
నీ మీదే ధ్యాస ఆయే
ఎన్నో ఊహలు నా హృదయాన గుస గుస లాడే
నాలో గుబులును పెంచే
నిన్నే తల్చే అను నిత్యం
నా మనసు నా మాట వినదు
ఉరకలు వేసే వయసు
అది నీకు తెలుసు
మరి ఎందుకు అలుసు
మరెన్నో జ్ఞాపకాలు
నా గుండెను పిండి చేయగా
నీ రాకకై ఎదురు చూసె
నీ ఊహలరాణిని
రావోయి మాధవా!
నీ ప్రియ రాధను చేరగా
నా ఆశలసారధి
అనురాగ పెన్నిధి
నా ఊహల ఊపిరి
నీవే నా సమస్త సిరివి
నేను నీ హృదయదాసిని.
మన ఇద్దరి ప్రేమ జగతిలో మధురానుభూతి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!