చిరునవ్వుల సంతకం
రచన: సరిత రవి ప్రకాష్
అద్దం ముందు
నిల్చొని నన్ను
నేను చూసుకున్నా, మోముపై చిరునవ్వును అద్దటానికి ప్రయత్నం చేశా,అయినా పెదవుల అంచుల్లో ఎదో వెలితి…..
చిరునవ్వు అంచుల దాకా వెళ్ళి వస్తున్నా కానీ ఎక్కడ కనపడటం
లేదు, అంతటా ఏదో తెలియని
విషాదం అలుముకొని ఉంది….
ఎందుకంటావు నీవు లేవు నా చెంతన అనే కాబోలు, రివ్వున వీచే గాలికి ఎగిరే ఇసుక రేణువంత తేలికగా ఉండాల్సిన నా చిరునవ్వు, పొడి పొడిగా ఏదో భారమైన నవ్వుగా అనిపించింది..
ఈ జీవంలేని ప్రేమ అనే మాయలో పడి, నా చిరునవ్వుకు జీవమే లేకుండా పోయింది, ఎందుకో నిశీధి ఛాయలు అలుముకున్నాయి, నీరాకతో అయినా నిశీధి తొలగి నా పెదవులపై “చిరునవ్వుల సంతకం” చేస్తావని ఎదురుచూస్తోంది నా మనసు ఆశగా నీకై నీరాకకై…
***