(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)
మానవ జీవనం
రచన:: డి.స్రవంతి
ఏం….చిత్రమో..మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారేనే!
మనిషి సృష్టించిన జీవి మానవ జీవనాన్ని శాసిస్తుంది…
నేటి పురోగతి అదఃపాతాళంలోకి పోతుంది.
మృత్యువు కరాళ నృత్యం చేస్తుంది
ధనార్జనకై ప్రకృతిని విషతుల్యం చేసే!
ప్రాణ వాయువు కలుషితమయ్యే…
రసాయనాల వలలో చిక్కి నిఖిలఓర్వి అంతయు రక్తసిక్త మయ్యేనే….
అధిక లాభార్జన కై అరువులు చాచి సత్తువ లేని ఫలాలను అందించే…
ఇదేమి… చిత్రమో… మానవ జీవిలోను సత్తువ లేని కణాలు ఉద్భవించే..
సమస్త ప్రాణికోటి జీవనం అస్తవ్యస్తమయ్యే!
మానవుడు సృష్టికి పునః సృష్టి గావించినను…
చిత్రం …భళారే విచిత్రం! ఆ సృష్టికే (జీవికి) తానే బలయ్యే..
***