ఆడపిల్లను నేను అగ్గిపిడుగును నేను

ఆడపిల్లను నేను అగ్గిపిడుగును నేను

రచన: శృంగవరపు శాంతికుమారి

ఆడపిల్లను నేను అగ్గిపిడుగును నేను!
ఇంకెన్నాళ్ళు సహిస్తాను భరిస్తాను
వరకట్నం పేరుతో వేదింపులు
కట్టుబాట్లు పేరుతో పంజరంలో చిలకలా బానిససంకెళ్ళతో నిర్బంధాలు
ప్రేమ పేరుతో నయవంచనలు
ఏసిడ్ దాడులు కత్తులతో హత్యలు
ఆడపిల్లను నేను అగ్గిపిడుగును నేను!

మేకవన్నె మృగాల పాలిట గర్జించే సింహం నేను
వెంటాడి వేధించి హించించి పీక్కుతినే రాబందులను కాల్చి బూడిద చేసే
భగభగ మండే అగ్ని జ్వాలను నేను
ఆడపిల్లను నేను అగ్గిపిడుగును నేను!

శరణన్న వారిని రక్షిస్తాను
నాకే భద్రత లేదనుకుంటే
భద్రకాళినై ఎదురుతిరిగి పోరాడతాను
వంటింటి కుందేలు కాను నేను
అబలను కాను సబలను నేను
అణగదొక్కాలను కొనే వాళ్ళని చీల్చిచెండాడే వజ్రాయుధాన్ని నేను
ఆడపిల్లను నేను అగ్గిపిడుగును నేను!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!