బానిసనే

బానిసనే

రచయిత :: బండి చందు

మా అమ్మ అందంగా
అబద్దాలు చెబుతుంది
నిర్భయంగా నిజాలను
తన భుజాలపై మోస్తుంది
అల్లిన అక్షరాల మాలిక
నా తల్లి చిరుదరహాసం
సంద్రపు అలల ముత్యపు
మెరుపు ఆమె ఆవేశం
నిన్నటి నా గతాల గరళాన్ని
కంఠాన దాచిన ముక్కంటి
రేపటి నా భవిష్యత్తు తరాలకి
అమృతాన్ని పంచిన ముక్కోటి
ఎల్లలు లేని కష్టాల కడలికి
ఆమె నిలువెత్తు రూపం
ఎల్లవేళలా నా ఎదుగుదలకు
ఏ శిల్పి చెక్కని ప్రతిరూపం
నేను ఏ మంచి చేసివుండను
తనకి మాత్రం పుణ్యాత్ముడిని
నేనే యుద్ధం చేయలేదు
అయిన తనకి ఓటమిలేని చక్రవర్తిని
కానీ ఈ చక్రవర్తి ఎప్పుడూ ఆమె
పాదలకి ఆ జన్మాంతం బానిసనే..!

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!