అమ్మ ఒక తియ్యని భావన

అమ్మ ఒక తియ్యని భావన

రచయిత :: సావిత్రి కోవూరు

‘అమ్మ’ అను ఆ పదమే ఒక తియ్యని భావన

ప్రాణాలనే పణముగా పెట్టి జన్మనిచ్చే దేవతే అమ్మ

తను ఆకలితో అలమటిస్తున్న, పిల్లల ఆకలి తీర్చేది అమ్మ
పిల్లల బుడి బుడి నడకలు చూసి, అబ్బురపడే అల్ప సంతోషి అమ్మ

తప్పటడుగులు పడనీయక, కనురెప్పలా కాపాడేది అమ్మ
తన ప్రాణానికి ఆపద వచ్చినా లెక్కించక

పిల్లలకి చిన్న గాయమైనా తల్లడిల్లేది అమ్మ

ప్రేమ అనే అమృతం ఎంత పంచినా తరగని అమృతభాండం అమ్మ

రాపిడికి ఎంత గురి చేసిన సుగంధాలను వెదజల్లే శ్రీగంధమే అమ్మ

అమ్మే ఒక కల్పవృక్షం కోరికలు తీరుస్తూనే ఉంటుంది.

మనసుకు ఎన్ని దెబ్బలు తగిలిన ఫలాలనిస్తూనే ఉంటుందీ ఫల వృక్షం.

అమ్మ ఒక తరగని మధురపు ప్రేమ ఊట
ప్రేమ ఎంత పంచినా ఊరు తోనే ఉంటుంది.

మలినం అంటని శ్వేత వర్ణం అమ్మ

తన నీడ న నిశ్చింతగా నిద్ర పుచ్చే వట వృక్షమే అమ్మ

నీ రుణమే తీరనిది ఎన్ని జన్మలెత్తినా

నీవు ఉన్నప్పుడు విలువ తెలియని అవివేకులు,

ఎందరో ఆశ్రమాల పాలు చేసినా, పిల్లల బాగునే కోరే అమ్మ
అమ్మ లేని వారికే తెలుసు ఆ లోటేమిటో అమ్మ రుణము తీరనిది ఎన్ని జన్మలెత్తినా….

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!