లోకులు – కాకులు

లోకులు – కాకులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : మాధురి మేక

మాట్లాడితే ఇంప్రెస్స్ చేస్తున్నా అంటారు
మాట్లాడకపోతే ఆటిట్యూడ్ అంటారు
నవ్వితే నాకు ఎక్స్‌ట్రాలు
నవ్వకపోతే నావి నక్రాలు
నుంచుంటే నాది అతివినయం
కూర్చుంటే లేదంటారు గౌరవం
కలిసుంటే అందరితో నటన అంటారు
కలవకుంటే నాకు పొగరు అంటారు
బాబోయ్… వీళ్లకి ఎక్కువైతే సమయం..
తెచ్చి పెడతారు ఎదో ఒక కయ్యం..
అందుకే నా గూటిలో నేనుంటే నయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!