సరికొత్త ఉగాది

సరికొత్త ఉగాది

*చైత్రమాస చిరుగాలులతో…*

*కోయిలమ్మ కువకువలతో…*

*సరికొత్త చిగురులతో…*

*హాయైన వాతావరణంతో…*

 

*చిరుమామిడి వగరుతో…*

*చింతపండు పిలుపుతో…*

*వేపపువ్వు చేదుతో…*

*అరటిపండ్ల తీపితో…*

 

*కొత్త మిరప కారంతో…*

*కొత్త ఉప్పు పంటతో….*

*షడ్రుచుల సమ్మేళనమై…*

*ఉగాది పచ్చడియై….*

 

*సర్వరోగ నివారిణిగా…*

*వార్షికానికి ఒకసారి వచ్చి…*

*పాత కలతలను పోగొట్టి…*

*నూతన వత్సరాన్ని మాకిచ్చి…*

 

*చేదు పండుగగా పేరు గాంచినా…*

*చిరు సంతోషాలను పంచి…*

*చిగురుటాకుల సువాసనాలతో…*

*హాయినొసగే మా ఈ “ఉగాది” పండుగ…*

                రచన: శాంతి కృష్ణ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!