తల్లీ నీకు వందనం

తల్లీ నీకు వందనం

రచయిత :: కంచుబారికి చిన్నారావు

మాటల్లో చెప్ప వీలుకాదు ఆమె గొప్పతనం.
రాతల్లో రాయలేము తను చేసిన త్యాగం.
పాటల్లో పాడ తరమా ఆ అద్భుత రాగం.
చేతులెత్తి మొక్కిన తీరునా తల్లి ఋణం.
వెలలేని విలువైన ఇలలోని ఆ దివ్య రూపం.
జగతికి జననే కదా శాశ్వత తేజో కిరణం.

ఈ చరాచర జగత్తుకు ఆమే కదా విత్తు.
ప్రేమను పంచే దివ్యౌషధ మహత్తు.
కరకు నేలను సైతం కన్నీటితో సాగుచేసి,
చెరకు తీపిని మనకు అందించు అమృత వర్షిణి అమ్మ.

నలుసుగానే గర్భమందు నాటబడిన క్షణము నుండి,
నాడి ఆగి భూగర్భమందు
పాతబడిన సమయం వరకు,
మన కోసమే పరితపించు
త్యాగశీలి అమ్మ.
తన లోకమే మనమంటూ మురిసే దేవత అమ్మ.

పిండముగా నేనుండగా ఎన్ని గండాలను దాటిందో..
నలుసునైన నా కొరకు ఎంత నలిగిపోయిందో..
అద్దంలో నా రూపం చూసుకుంటే తెలిసింది.
ముద్దులొలికే మోము మా అమ్మకు ప్రతిరూపమని..
తలచి కొలిచే తొలి దైవం అమ్మ.
కనపడని దైవాలు కోకొల్లలు వుంటారని కథలలో చదివాను.
కని పెంచే దైవం అమ్మే అని తెలుసుకొని చేతులెత్తి మొక్కాను..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!