కంద పులుసు

కంద పులుసు

రచన :: ” దీపు” వీర

అందరికి నమస్కారం నేను మీ దీపు,
ఈరోజు మనం అమ్మమ్మలు, బామ్మలు చేసే కంద పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం.

ముందుగా కావలసిన పదార్థాలు ::
కంద      –  1/2kg
వంకాయ  -1  (మీడియం సైజ్ )
టమాటో     -2
కొత్తిమీర     -కొద్దిగా
చింతపండు  – నిమ్మకాయ సైజ్ అంత
బెల్లం         – రుచికి సరిపడా (అంటే ఈ పులుసు తీయగా తింటే చాలా బాగుంటుంది, తీపి ఇష్టం లేని వారు తగ్గించి వేసుకోవచ్చు )
ఉప్పు        – సరిపడా
కారం         – ఒక స్పున్
పసుపు     – చిటికెడు
మెంతులు – కొద్దిగా
ఉల్లిపాయలు – ఒకటి
పచ్చి మిర్చి – 4
నూనె         – సరిపడినంత
తిరగమాత కి కావలసిన పదార్థాలు ::
ఎండు మిర్చి – 4
ఆవాలు       – సగం చెంచా
జీలకర్ర        – కొద్దిగా
ఇంగువ       – కొద్దిగా
కరివేపాకు    – 2రెమ్మలు

తయారు చేసే విధానం ::

-ముందుగా కందని ఉడకబెట్టి ముక్కలు గా కోసి ఉంచుకోవాలి, మిగతా కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి
-ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పు గా ఉండే కడాయి పెట్టుకొని (పులుసు కాలిగా ఉడికితే బాగుటుంది )
-4 టేబుల్ స్ఫూన్స్ నూనె వేసుకొని వేడి చేయాలి. వేడి అయ్యాక కొద్దిగా మెంతులు వేసుకొని వేపాలి.
-అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ, టమాటా, ఉల్లి ముక్కలు వేసి వేపాలి.అవి కొంచెం మగ్గిన తరువాత కంద ముక్కలు వేసి మరి కొద్ది సేపు మూత పెట్టి ఉంచాలి,తర్వాత పసుపు, -కారం, ఉప్పు వేసి బాగా కలిపి చింతపండు పులుసు వేసుకోవాలి.
-ఇప్పుడు దానికి సరిపడా బెల్లం కూడా వేసి మీడియం మంట తగ్గించి  పెట్టి ఉడకనివ్వాలి.
-పులుసు దగ్గర పడ్డాక పోపు వేసుకోవాలి.

పోపు వేసే విధానం ::

-స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి.
-ఇప్పుడు కొంచం కొత్తిమీర జల్లి స్టవ్ మీద నుండి దింపుకోవాలి.
-గుమ గుమ లాడే కంద పులుసు రెడీ
-వేడి వేడి మజ్జిగ మిరపకాయలు నంజుకుని తింటుంటే,
-ఆహా ఏమి రుచి తినరా మైమరచి అని అనిపిస్తుంది.
మరి ఇంక ఆలస్యం ఎందుకు మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు…
 

You May Also Like

2 thoughts on “కంద పులుసు

  1. Wow super ఉంది పిక్ చూస్తుంటే..చేసాక ఇంకా బాగుంటుంది అనిపిస్తోంది…పాత వంటలు కొత్త గా చూపిస్తున్నావ్ దీపు…👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!