డాక్టర్ నవ్య ‘ఓ ప్రేమ ఖైదీ’

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

డాక్టర్ నవ్య ‘ఓ ప్రేమ ఖైదీ’

రచయిత :: ఎన్. ధనలక్ష్మి

ప్రాణాలు కాపాడే డాక్టర్ ?నలుగురిని చంపిందా! కానీ ఎందుకు? చంపింది?తను చంపింది ఎవరినో  కాదు తనని ప్రేమించిన అబ్బాయీ కుటుంబాన్ని…పైగా రేపు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కూడా? ఎందుకు అలా చేసింది? వారిని అతి దారుణంగా ముక్కలుగా కోసి మరీ   చంపింది ? ఎవరో తెలుసుకోవాలి అంటే బ్రేక్ తరువాత చూడండి అని యాంకర్ చెప్పడం అడ్వటైజ్మెంట్ రావడం జరిగింది
అబ్బా ఈ న్యూస్ ఛానల్స్ ఎప్పుడు ఇంతే టెన్షన్లు పెడతారు అని విసుక్కున్నాడు లాయర్ సూర్య..
చంపింది ఎవరో కాదు డాక్టర్ నవ్య అని తన ఫోటోని చూపించారు సరిగా పది నిమిషాలకు.తనని ఎక్కడో చూసా అని అంతర్జాలంలో డాక్టర్ నవ్య గురించి వెతికాడు.
తన గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి ..
నవ్య పని చేసే హాస్పిటల్ కి వెళ్లి విచారించారు..అందరు తన గురించి చాలా గొప్పగా చెప్పారు..ఎవరైనా పేషెంట్స్ డబ్బులు కట్టకపోతే ఫ్రీగా వైద్యం చేసేది అని,తన సొంత డబ్బుతో మందులు కూడా తీసి  ఇచ్చేది, తన శాలరీ లో సగం డబ్బు ఇలా సహాయం చేయడానికి వాడేది అని తెలిసింది..
స్వతహాగా న్యాయం వైపు నిలబడి పోరాడే సూర్య ఈ  కేసును వాదించాలి అనుకున్నాడు..
ఇలా ఎలా తను అతి క్రూరంగా నలుగురునీ చంపింది అని సూర్య అలోచించి నవ్యను కలవటానికి జైల్ కి వెళ్ళాడు..
” జైలర్ నీ  కలసి  నవ్య గురించి అడిగాడు…
తనని మేము తీసుకువచ్చినప్పటి నుంచి తను సైలంట్ గా ఉంది అని చెప్పాడు. ఎంత అడిగినా జరిగిందేమిటో చెప్పటం లేదు..
సూర్య జైలర్  పర్మిషన్ తీసుకొనీ నవ్యని కలిశాడు.
” నవ్య…నీకు నేను గుర్తు ఉన్నాన్న…సరిగా మూడు నెలల క్రితం రోడ్డు  పక్కన ఆక్సిడెంట్ జరిగితే అందరి లాగ నాకు ఎందుకులే అనుకోకుండా , నువ్వు అటెండ్
మీటింగ్ కూడా వెళ్లకుండా నీ జాబ్ ని రిస్క్లో పెట్టీ మరి కాపాడావు కదా!అది ఎవరో కాదు నేనే..నన్ను కాపాడింది నువ్వు అని నాకు కూడా తెలియదు హాస్పిటల్లో నన్ను చూసి నీ కోలిగ్ గుర్తుపట్టి చెప్పేదాకా. ఎవరో ఒక్కరూ నన్ను జేర్చి ఉంటారులే అనుకున్న…
ఎవరో ముక్కూ మొహం తెలియని వాడి కోసం నీ కెరీర్ రిస్క్ లో పెట్టీ మరి వైద్యం చేసి ప్రాణాలను కాపాడిన నువ్వు.ఎలా నీ లవర్ నీ,
అతని కుటుంబంన్నీ  చంపావు..? ఒక్క లాయర్ గ  కాదు ఒక అన్నయ్య గా అడుగుతున్న చెప్పు రా అని
ప్రేమగా అడగడంతో నవ్య చెప్పడం స్టార్ట్  చేసింది ”
“నాకు ఊహ తెలిసేటప్పటికే ఆశ్రమంలో ఉన్న..బాగా చదువుకుంటున్నా అని స్పాన్సర్స్ ముందుకు వచ్చి నన్ను చదివించారు అలా నేను డాక్టర్నీ అయ్యాను..
నాకు ఉన్న ఒకే ఒక్క నేస్తం విద్య. మేము ఇద్దరం ప్రాణ మిత్రులం. ఏమైందో నాకు తెలియదు ఒక రోజు తను ఏడుస్తూ ఆశ్రమానికి  వచ్చింది. నేను ఎంత అడిగినా చెప్పలే దు..నేను కూడా ఉదయం అడుగుదాo అని అడుగులేదు.. తర్వాత రోజు తను సూసైడ్ చేసుకుంది . అది నేను జీర్ణించుకోలేక పోయాను
తను లేని ఆశ్రమంలో నేను ఇంకా ఉండలేక పోయాను.. బయటకు వచ్చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ అయిపోయాను. క్షణం తీరిక లేకుండా పని చేస్తూ ఉండేదాన్ని… ఖాళీగా ఉంటే తను  గుర్తుకొచ్చి బాధ పడతాను అని.. నా జీతంలో సగం ఆశ్రమానికి ఇచ్చేదాన్ని .
చరణ్ వాళ్ళ నాన్న గారికి నేనే వైద్యం  చేసేదానినీ. అలా చరణ్ తో  ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది .అతను చూపించే కేరింగ్ కి నేను కరిగిపోయాను… అతని ప్రేమలో నేను బందీ అయిపోయా… చరణ్ అమ్మానాన్న, అతని తమ్ముడు ఆనంద్ కూడా నన్ను బాగా ట్రీట్ చేసేవారు
నాకు కూడా కుటుంబం  దొరుకుతుందని సంతోషించా.. అతని ప్రేమను చూసి పొంగిపోయాను.కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు..
ఒకరోజు చరణ్ వాళ్ళ అమ్మ బర్త్డే పార్టీకి కి వెళ్ళాను . జ్యూస్ డ్రెస్ పైన పడడంతో క్లీన్ చేసుకోవడానికి దగ్గర్లో ఉన్న ఆనంద్
వాష్ రూమ్ కి వెళ్లాను . అక్కడ ఉన్న సెల్ఫ్ లో ఎదో చైన్ కనపడటంతో తీసి చూశాను….ఎవరిదో కాదు విద్య ది….నేను ఫస్ట్ సాలరీ తీసుకున్నప్పుడు ఆ సంతోషం రెట్టింపు చేసుకోవడానికి గుర్తుండేలా విద్యకి చైన్ తీసుకుని వచ్చాను.. కానీ అది ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు…
సూసైడ్ కి రెండు రోజుల ముందు విద్య ఎవరినో ప్రేమిస్తుందని అతన్ని తీసుకొని వచ్చి నాకు పరిచయం చేస్తాను అని చెప్పింది… ఒకవేళ  తను ఆనంద్ అయితే కాదు కదా.ఇంటికి ఎప్పుడు వెళ్ళిన నన్ను ఓ రూం వైపు వెళ్ళాకుండా ఆనంద్ అడ్డుకునేవాడు.
ఎందుకు అని నేను అడిగితే ఈ రూంలో విపరీతమైన దుమ్ము ఉంటుంది నీకు డస్ట్ అలెర్జీ ఉంది కదా వదిన అందుకే అన్నాడు. అనుమానం వచ్చి ఆ రూం లోకి వెళ్ళాను …రూం అంతా చీకటిగా ఉంది… విపరీతమైన మందు వాసన…లైట్స్ ఆన్ చేసి రూం అంత చూసాను విద్య సర్టిఫికెట్స్ కప్ బోర్డ్ లో దొరికాయి..నా అనుమానం బలపడింది..
చరణ్ పార్టీలో ఉన్నాడు…. ఇదే మంచి అవకాశం
డైరెక్ట్ గా అడిగితే ఎవరు నిజం చెప్పరు.. ఆనంద్ నీ పిలిచి మాటల్లో పెట్టీ హిప్నాటిజం చేశాను ..
విద్య ప్రేమించింది ఎవరినో కాదు చరణ్… తన ఇంటికి పిలిపించుకొని తన జ్యూస్ లో మత్తు మందు కలిపి చరణ్, ఆనంద్ ఆఖరికి వాళ్ళ నాన్న కూడా తనపై అత్యాచారం చేశారు…. ఆ వీడియోని షూట్ చేసి విద్యను బెదిరించారు కూడా… ఈ విషయాలన్నీ చరణ్ వాళ్ళ అమ్మకి కూడా తెలుసు.. ఆ వీడియోను చూపించి రెండు రోజులు విద్యకు  నరకం అంటే ఏమిటో చూపించారు.. తన సర్టిఫికెట్స్ కూడా లాక్కొని , ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించారు…వాళ్ళు ఒక విద్యనే కాదు చాలా మందిని అలాగే చేశామని ఆనంద్ చెప్పారు.
ఎవరూ లేని అనాధ అమ్మాయిలే టార్గెట్ అని తెలిసింది. కొంతమందిని దుబాయ్ మనుషులకు   కమ్మినట్టు కూడా చెప్పాడు….. నేను కూడా ప్లాన్ లో భాగమని తెలిసింది.
నాకేం చేయాలో అర్ధం కాలేదు .. ఇలాంటి వాళ్లు పోలీసులకు అప్పగించిన ఏదో ఒక లా నీ వాడుకొని మళ్లీ బయటకు వచ్చేస్తారు… పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు చరణ్ , వాళ్ళ నాన్న ఫుల్ మత్తులో ఉన్నారు వాళ్ళ అమ్మ కూడా డ్రింక్ వేసినట్టే ఉంది.. వారందరినీ కలిపి కట్టేసి ఇష్టమొచ్చినట్టు కొట్టాను.. కత్తి తీసుకుని ముక్కలు ముక్కలుగా కోసి చంపాను అని గట్టిగ ఏడిచింది నవ్య…”
“నా విద్యలాగ ఇంకెవరు బలి అవ్వకూడదని వారందరిని చంపాను… ఏ ప్రేమకి అయితే నేను బంది అనుకున్నానో చివరికి ఆ ప్రేమ వల్లే నేను ప్రేమ ఖైదీ అయ్యాను..”
” నువ్వు బాధపడకు నవ్యా..నీ కేసుని నేను
వాదిస్తాను సాధ్యమైనంతవరకు నీకు శిక్ష తక్కువ పడేలాగా చేస్తాను..
నవ్య కు కోర్టు పది ఏళ్లు శిక్ష విధించింది.. కాకపోతే నవ్య యొక్క ప్రవర్తన , జైల్లో తోటి ఖైదీలకు చదువు చెప్పడంతో పాటు వారు అనారోగ్యం పాలైనప్పుడు వారిని కాపాడింది కూడా తన వైద్యంతో..ఇవన్నీ చూసి కోర్టు తనకి రెండేళ్ళ జైలు శిక్ష తగ్గించింది
జైలు నుంచి రిలీజ్ అయిన నవ్యనూ సూర్య తీసుకుని వెళ్లి ప్రేమగా చూసుకున్నాడు..సూర్య బామ్మర్ది అయిన శక్తి కిచ్చి వివాహం కూడా జరిపించాడు…. అలా నవ్య జీవితం ఆనందమయం అయింది..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!