అడవి ఒంటరిగా
చందలూరి నారాయణరావు
అడవి
తలుపులేసుకుని
వెక్కి వెక్కి ఏడుస్తుంది..
పోరుబాటలో
ఆర్కే మార్కుకు
జేజేలు పలుకుతూ…
తుపాకీ కన్నీటికి
ఏరులై విలపిస్తున్న
విప్లవాన్ని కౌగిలించుకుని,
అతని హృదయానికి
లోకం పలికే జోహార్లకు
జతగూడుతూ…
అతని
దూరపు చూపులను,
మాటల లోలోతులను,
గుండెలకేసి కొట్టుకొని రోధిస్తూ….
తలుపు తెరిచి
బయటకొచ్చిచూసి ఒంటరిలా
పిచ్చిప్రజల కోసం
అతని ఆలోచనలో పొర్లాడుతూ
ప్రసంగాలతో మునిగితేలుతూ…
వెక్కి వెక్కి ఏడుస్తుంది
“ఒంటరి’గా….
( మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ మరణం పట్ల చింతిస్తూ…)