జీవన్ముక్తికి సోపానం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ప్రేమించే గుణం ఉంటే
ప్రపంచమే నీ దవుతుంది.
పంచభక్ష్య పరమాన్నం కన్నా ప్రేమానురాగాలతో పెట్టె
పచ్చడి మెతుకులు అత్యంత మధురం….!!
జగతిన మాతృత్వపు ప్రేమ అన్నింటి కన్నా మిన్న
న గాయత్రి పరమో మంత్రం
నా మాతృ పరదేవతా అన్నది అక్షరసత్యం….!!
ప్రేమతత్వానికి ప్రతీక
సనాతన ధర్మంలో శ్రీకృష్ణ కుచేల స్నేహబంధం కులమతాలకు అతీతం.
పేద గొప్ప తేడాలు స్వచ్ఛమైన ప్రేమలో కనిపించవు.
స్వార్ధంలేని, నిష్కళంక,నిరూపమాన ప్రేమ జగతికే ఆదర్శం
వసుదైవ కుటుంబాన
మానవులంతా పరమాత్మ స్వరూపాలేనని భావించి మానవ సేవే మాధవసేవగా
ఆచరిస్తే ప్రేమతత్వమే ముముక్షత్వం అదే
జీవన్ముక్తికి సోపానం…!!