నా మనోబాణం

అంశం:మన్మధ బాణం

నా మనోబాణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆకుమళ్ల కృష్ణదాస్

అవనికే వర్ణాలద్దిన ఆమని నీవు
ఏమని పిలవాలో పేరు తెలియదాయే
నేలన నడయాడే జిలుగుల నక్షత్రానివి
నేనెలా మరువను నీ విరుపుల మెరుపులు
కళకళలాడే కలువకనుల లలన వీవు
పట్టుపరికిణీ కట్టులో సింధూరం బొట్టులో
పట్టుతప్పి చెట్టెక్కింది నా మది కోయిల
గంధర్వ కన్యవేమో గానకచేరీ చేద్దామని
భ్రమరాలు కూడా భ్రమ పడ్డాయి
మకరందాల మల్లికల మాలిక నేమో యని
వరాలిచ్చే దేవతవై వరించవా నను
పసిపాపలా తల నిమిరే పాపిడిబిళ్ళ నౌతా
బాంధవ్య సూచికలా భాసికాన్నౌతా
సువిశాల జగాన్ని చూపే నుదుటి సింధూరాన్నౌతా
మిక్కిలి మక్కువ వెలుగుల ముక్కెర నౌతా
గుండెల గుడిలో గిలిగింతలు పెట్టే మాంగళ్యo అవుతా!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!