అంశం: మన్మథ బాణం
ప్రణయ వేదన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: అలేఖ్య
నీ రూపం కర్పురం
నన్ను దహిస్తుంది ప్రతి క్షణం
నీ స్పర్శ వెచ్చని ధూపం
నన్ను తన సెగలో బంధించింది
నీ పలుకే నా చెవులకి నైవేద్యం
వినగనే చేస్తున్నాయి నాట్యం
నీ ఉంగరాల ముంగురులు ముచట్టిస్తున్నాయి
నా ఊపిరితో గుసగుసలాడుతూ
చురకత్తిలాంటి నీ చూపులు
మధనుడు వదిలిన వలపుల మన్మథ బాణం
నా గుండెను గుచ్చి చేస్తున్నాయి రణం
నా ఊపిరి నీ ఊపిరితో మమేకమయ్యే క్షణాలకై నిరీక్షిస్తూ