అంశం: మన్మధబాణం
ప్రణయసాధనం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
మన్మధబాణం అదొక ప్రణయసాధనం
ఇరువురి హృదయాలను స్పందించే సారం
రసమయజగతులో విహరింపజేస్తుంది
ప్రేమమాధురిలను ప్రజ్వలిస్తుంది
అదొక ఆనందలోకం
అదొక శృంగారజీవనపధం
అదొక చైతన్యశీలసంచారం
జడత్వంనుంచి మేల్కొలుపుతుంది
జవసత్వాలకు పదునుపెడుతుంది
అమరత్వానికి దారిచూపుతుంది
అజరామరమై వెలుగొందుతుంది
అమరప్రేమకు చిరస్థాయిగా నిలుస్తుంది.