ఏమని చెప్పను..

ఏమని చెప్పను..?

రచన: పిల్లి.హజరత్తయ్య

ప్రపంచానికి ఆదర్శ ఇతిహాసమై నిలిచిన
భారత స్వరాజ్య సంగ్రామ చరిత్ర
వీరోచిత గాథలపై ఏమని చెప్పను..?

దేశమాత ఒడిలో ఒరిగిన త్యాగధనులపై
దేశభక్తుల సాహస పోరాటపటిమపై
సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నిస్వార్థపరులపై
ప్రతి నిప్పుకణికపై ఎంతని చెప్పను..?

గిరిజన తండాల్లో స్పూర్తి నింపి
బ్రిటిష్ వారి గుండెల్లో నిదురించిన
మన్యం వీరుడు సాహసాన్ని తెలుపనా..!

పద్దెనిమిదేళ్లకే ఉరికొయ్యను ముద్దాడిన
దేశభక్తుడైన యువ కెరటం
ఖుదీరామ్ బోస్ వీరత్వాన్ని వివరించనా..!

ఆంగ్లేయులకు సింహస్వప్నంలా నిలిచి
వారి వెన్నులో వణుకు పుట్టించిన
వీరపాండ్య కట్టబొమ్మన్ శూరత్వాన్ని పొగడనా..!

మూడు మార్లు కాల్పులు జరిపినా
త్రివర్ణపతాకాన్ని చేతబూని ముందుకురికిన
మాతంగిని హజ్రా ధీరత్వాన్ని గుర్తుచేయనా..!

వేషం భాష కులం మతం వేరైనా
మహనీయులు చూపిన త్యాగనిరతిని
యువతరం మనసులో పుష్పించుకొని
దేశఔన్నత్యాన్ని గుభాళించేలా చాటాలని చెప్పనా..!

***

You May Also Like

One thought on “ఏమని చెప్పను..

  1. జన్మదిన శుభాకాంక్షలండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!