హరివిల్లు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నాగ రమేష్ మట్టపర్తి
మంది ఎక్కువైతే
మజ్జిగ పలచన
చనువు ఎక్కువైతే
బంధం చులకన
వాడిన పూవులో
పరిమళాన్ని వెతకకు
వీడిన బంధం లో
ప్రేమకై చూడకు
సద్గుణాలను పెంచు
దుర్గుణాలను తెంచు
సమస్యలను అధిగమించు
చేరెదవు విజయపు అంచు
చెప్పుడు మాటలు వినకు
దెప్పుడు మాటలు అనకు
గుప్పెడు గుండెను పిండకు
తప్పుడు తోవన ఉండకు