దేవేరి అలుక
రచయిత: సరస్వతి నిత్య
లోకములను చల్లగా చూసే నీ కనులేమో
కమలముల వలే ఎర్రబడినాయి
మళయమారుతమగు నీ ఉచ్వాస
అలజడిచేయి అలలవలే ఎగసిపడుతున్నవి
మధురము నింపుకున్న నీ పెదవులు
దిశను మార్చుకున్న పూలవలే వంకరగా తిరిగినది
నీ అలుక తీర్చగ అవతారములెన్నో ఎత్తినానే
నాకై నీ అరవిందము వంటి ముఖమునెత్తుమా దేవేరి!!
లోకములను పాలించేవాడినైనా
నీ సోగసుని లాలించనా
సేవలను పొందే భోగపురుషుడ నైనా
నీ సోయగముని బుజ్జగించనా